సబితా ఇంద్రారెడ్డి జగన్ వెనకే...?

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సబితా ఇంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు ఆమె అటు వైపు వెళ్లే అవకాశాలు లేవు. 2014 ఎన్నికల నాటికి ఆమె వైయస్సార్ కాంగ్రెసు జెండాను మోయవచ్చునని అంటున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయమైన చెల్లెగా ఆమెకు పేరుంది. వైయస్ రాజశేఖర రెడ్డి 2009లో ఆమెను హోం మంత్రిని చేసి ఓ మహిళా నాయకురాలికి ఆ శాఖను అప్పగించిన ఘనత సాధించారు. అలాగే, ఆమె కొంత కాలం గనుల శాఖను కూడా నిర్వహించారు.
సబితా ఇంద్రారెడ్డి ఎప్పటికైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేపోయేవారేనని చెబుతున్నారు. ఆమె అటు వెళ్తే గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు బలపడుతుంది. ఆమె సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. పి. శంకరరావు చేసిన ఆరోపణల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications