టి-కాంగ్రెసులో ద్రోహులు ఎవరు?

Madhu Yashki
తెలంగాణ కాంగ్రెసులోనే కొందరు ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం కోరుకోవడం లేదని, టి-కాంగ్రెసులోనే తెలంగాణ ద్రోహులు ఉన్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మాటలపై ఇప్పుడు టి-కాంగ్రెసులో చర్చ జరుగుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే దానిపై అందరూ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. పలువురు మంత్రులు గతంలో తెలంగాణ అవసరం లేదని తాము మేనేజ్ చేయగలుగుతామని అధిష్టానం వద్ద చెప్పినట్టు కథనాలు వచ్చాయి కూడా. ఆయన కూడా వారిని ఉద్దేశించే అన్నట్లుగా పలువురు భావిస్తున్నారు.

ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు పలువురు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోని, ప్రస్తుతం ఉన్న మంత్రుల వైపు అనుమానంగా చూస్తున్నారు. వైఎస్ సిఎంగా ఉండగా కొందరు మంత్రులు తెలంగాణ అంశంపై మాట్లాడేందుకే ముందుకు రాలేదు. మరికొందరు అభివృద్ధి తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని, అభివృద్ధి జరిగాకే ప్రత్యేక రాష్ట్రం కావాలని యువ ప్రజా ప్రతినిధుల ఫోరం పేరిట పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ, వైఎస్ వ్యతిరేకులుగా పేరొందిన కేఆర్ ఆమోస్, కె. యాదవరెడ్డి, బి.కమలాకర్‌రావు, పాల్వాయి గోవర్దనరెడ్డి తదితర నేతలను అప్పట్లో పక్కకు పెట్టారు. అంతేకాదు ఎదురుదాడికి కూడా దిగేవారు.

వైఎస్ మరణానంతరం రాష్ట్ర రాజకీయాలతోపాటు, ఆ నేతలూ మారిపోయారు. వారంతా తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకున్నారు. ఇప్పుడు హోదాలకు అతీతంగా మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా తెలంగాణ వాదం వినిపిస్తున్నారు. ఏకతాటిపై నిలిచారు. ఇలాంటి సమయంలో మధుయాష్కీ పేల్చిన తూటా గుమ్మడి కాయల దొంగలు భుజాలు తడుముకునేలా చేసింది. ఉద్యమ ద్రోహులు ఎవరన్న చర్చకు దారి తీసింది. అప్పట్లో అధినాయకత్వాన్ని కలిసి తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకున్నా పర్వాలేదంటూ అధిష్ఠానానికి నూరిపోసిన వారెవరన్న చర్చకు తెరలేపింది. ఇది ఇక్కడితో ఆగిపోతే మంచిదని, అధిష్ఠానానికి గతంలో ఎవరెవరు ఏయే నివేదికలు ఇచ్చారోనన్న చర్చలోకి వెళితే అంతర్గత విభేదాలు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా మధుయాష్కీ వ్యాఖ్యలను ఖండించక పోవడమే కాకుండా కావచ్చునని కూడా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+