పారని జగన్ తెలంగాణ పాచిక

YS Jagan
కడప ఉప ఎన్నికల్లో సాధించిన ఘన విజయానందం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఏ మాత్రం మిగలడం లేదు. ఆయనకు ప్రత్యర్థుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతుండడంతో పాటు ఆయన వ్యూహాలేమీ ఫలితాలు ఇవ్వడం లేదు. చెప్పాలంటే, వ్యూహాలు బెడిసికొట్టి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ అంశంపై వీలైతే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించాలని వైయస్ జగన్ చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. పైగా, రాజీనామాలు చేసిన 28 మంది శాసనసభ్యుల్లో ఒక్కొరక్కరే వెనక్కి వస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

మధ్యంతర ఎన్నికలకైతే సిద్ధఫడుతామంటున్న వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఉప ఎన్నికలకు సిద్ధంగా లేరు. తెలంగాణపై ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుండడంతో తెలంగాణకు చెందిన కాంగ్రెసు శానససభ్యులు రాజీనామాలు చేస్తారని, ఆ రాజీనామాలను ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలని వైయస్ జగన్ భావించారు. వివిధ పార్టీల తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో ఆయనకు మొదటి ఎదురు దెబ్బ తగిలింది.

సకల జనుల సమ్మె నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేస్తారని ఆయన భావించారు. రాజీనామా చేసేలా ఒత్తిడి తెవాలనేది కూడా జగన్ వ్యూహంలో భాగమని అంటున్నారు. అందుకే తెలంగాణకు చెందిన కొండా సురేఖ, కుంజా సత్యవతి, జయసుధ 26 మందితో పాటు రాజీనామా చేయలేదని సమాచారం. తెలంగాణ సకల జనుల సమ్మె ప్రారంభం కాగానే కొండా సురేఖ, కుంజా సత్యవతి రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాల ద్వారా కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులపై ఒత్తిడి పెరుగుతుందని వైయస్ జగన్ భావించి ఉంటారు. అయితే, జగన్ కన్నా తెలివిగా కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులున్నారు.

ప్రభుత్వం పడిపోయే స్థితి ఉంటే కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ప్రజల ముందుకు రాకుండానైనా కాలక్షేపం చేస్తారు తప్ప రాజీనామాలు చేయబోరనే విషయం జగన్‌కు చాలా ఆలస్యంగానైనా అర్థమైందో, లేదో తెలియదు. మొత్తమ్మీద జగన్ తెలంగాణ పాచిక పారలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+