జగన్‌పై పైచేయి కోసమే వైయస్ వివేకా...

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రయత్నిస్తుంటే దాన్ని తాము ఎదుర్కోవడం లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో వైయస్ వివేకానంద రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి జగన్ వర్గం నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు సీనియర్ నాయకులు వి. హనుమంతరావు వంటివారు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలను వైయస్ జగన్ వర్గం వాడుకుంటూ తమకు నష్టం కలిగిస్తున్నారని వైయస్ వివేకానంద రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు.
వచ్చే పులివెందుల శానససభ ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి ఆ విషయం తనకు ఆటంకంగా మారుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్‌పై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడంలో వైయస్ జగన్ వర్గం కన్నా తాను ముందున్నట్లు ఆ ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి శాసనసభలో జరిగిన సంఘటన తనకు ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నారట. అందువల్ల ఆయన జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్దంగా లేరని అంటున్నారు. అలా క్షమాపణ చెప్తే తప్పుడు సంకేతాలు కడప జిల్లా ప్రజలకు వెళ్తాయని ఆయన చెబుతున్నట్లు వినికిడి. దాన్ని తప్పించుకోవడానికి రాజీనామా చేయడానికి వివేకానంద రెడ్డి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆ రకంగా వైయస్ జగన్‌పై పైచేయి సాధించడం వివేకా ఉద్దేశంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications