వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు ధీటుగా ఆజాద్ వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad - YS Jagan
ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. తిరుపతి, నెల్లూరు నియోకవర్గాలలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు, నేతలకు దైర్యం నూరి పోశారు.

ఈ సమావేశంలో జగన్ అవినీతిపై ఎటాక్ విషయం చర్చకు వచ్చింది. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా తామెవ్వరం ఈ విషయంలో గట్టిగా వ్యవహరించలేకపోయామని.. పైపెచ్చు గతంలో రాష్ట్ర మంత్రులమంతా కూడా ఇక్కడ అమలుచేస్తున్న పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలుగానే చెప్పుకొంటూ వెళ్లడం కూడా కొంత నష్టం చేసిందని ఆయన అన్నారని తెలుస్తోంది.

వైయస్ మరణించిన తర్వాత దాదాపు ఏడాదిన్నర వరకు తాము ఆయన కొడుకు అవినీతిని పెద్దగా లేవనెత్తలేకపోయామని అంగీకరించారని తెలుస్తోంది. అయితే, జనంలో వైయస్‌పై ఉన్న సానుకూల సెంటిమెంటే ఇందుకు కారణమని ఆయన చెప్పినప్పుడు.. ఆజాద్ అడ్డు తగిలారని తెలుస్తోంది. సెంటిమెంటు ఎందుకుంటుందని, మీరు పూర్తిస్థాయిలో అటాక్ చేయాలని సూచించారు. అలాకాకుండా నెమ్మదిగా ఉండటం వల్లే సెంటిమెంట్ అని భయపడుతున్నారని కర్తవ్య బోధ చేశారు.

ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, పార్టీ బలోపేతం కావడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని, సార్వత్రిక ఎన్నికల నాటికి ఏం చేయాలో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రచించాలని సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని వారికి సూచించారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే అసలు జగన్ పార్టీకి కేడర్ లేదని ఆయన వారికి సూచించారు.

మీరంతా సెంటిమంట్ అని వదిలేయడం వల్లే జగన్ ఎదుగుతున్నాడని, దీన్ని అర్థం చేసుకుని వెళ్తే జగన్ పార్టీని అధిగమించడం కష్టమేమీ కాదని సూచించారని తెలుస్తోంది. మనోధైర్యంతో ముందుకెళ్లాలని వారికి సూచించారు. ఈ సమయంలో మళ్లీ రామనారాయణ రెడ్డి కలగజేసుకుని, తామంతా జగన్ విషయంలో అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని చెప్పగా, అప్పుడు జరగనిది ఇప్పుడెలా జరిగందని ఆజాద్ ప్రశ్నించారని తెలుస్తోంది. మొహమాటం లేకుండా నేతలంతా దూసుకెళ్తే జగన్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని సూచించారని సమాచారం.

English summary

 Central minister and stat congress party incharge Ghulam Nabi Azad was suggested party leaders to attach strongly YSR Congress party leaders comments against Congress party. He met party leaders at Tirupati and Nellore after campaign and told them, we will win if try due tothere is no sentiment of YSR and no cadre to YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X