చిరుకు కౌంటర్‌గా దాసరికి బొత్స మద్దతు?

చిరంజీవి తనను కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర కావడం బొత్స సత్యనారాయణకు నచ్చడం లేదని అంటున్నారు. దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో దాసరి నారాయణరావును ముందుకు తోయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీకి దాసరి నారాయణ రావు అవసరాన్ని పార్టీ అధిష్టానానికి వివరించేందుకు కూడా ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. దాసరి నారాయణ రావు పార్టీకి చేసిన సేవలను, పార్టీకి కట్టుబడిన విషయాన్ని వివరించి, ఆయనను దూరం చేసుకోవడం వల్ల సంభవించే నష్టం గురించి చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవికి మద్దతుగా వస్తారని పసిగట్టిన బొత్స సత్యనారాయణ ముందుగానే తన పథకాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దాసరి నారాయణ రావు ఇటువంటి రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఆయనకు రాజకీయాల్లోని ముఠా వ్యవహారాలు అంతగా నచ్చవని అంటున్నారు. తన అవసరాన్ని పార్టీ అధిష్టానం గుర్తించి ఇస్తే అభ్యంతరం లేదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా తాను ప్రయత్నాలు చేయకూడదనే ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications