కాంగ్రెసు తురుపు ముక్కలు చిరు, వైయస్ వివేకా

Chiranjeevi and YS Viveka
మెగాస్టార్ చిరంజీవిని, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం తురుపుముక్కలుగా వాడాలని ఉద్దేశించినట్లు అర్థమవుతోంది. రాష్ట్ర కాంగ్రెసులోని కొంత మందికి ఉన్నత పదవులు ఇచ్చి వారిద్దరిని తగిన సమయంలో విజయానికి సోపానాలుగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరికి పదవులు ఇవ్వకపోయినా వారి గౌరవానికి లోటు రాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు తీసుకుని కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారనే మాట వినిపిస్తోంది. అయితే ఆయన ఏప్రిల్ వరకు ఆగాల్సి ఉంటుందని అంటున్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి ఢిల్లీలో మకాం వేసి తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. చాలా మందికి దక్కని సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ వైయస్ వివేకానంద రెడ్డికి చాలా సులభంగా లభించడాన్ని బట్టి ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. అయితే, వివేకానంద రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. అయితే, ఆయనకు తగిన స్థానం కల్పిస్తారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన స్టార్‌డమ్‌కు దీటుగా చిరంజీవిని వాడాలని అనుకుంటున్నట్లు చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణ, తదితర నందమూరి హీరోలు ఎన్నికల ప్రచారానికి దిగే అవకాశం ఉంది. వారిని దీటుగా ఎదుర్కోవడానికి చిరంజీవి బాగా పనికి వస్తారని అనుకుంటున్నారు. అంతేకాకుండా, చిరంజీవి కుటుంబ సభ్యుల ఫాన్ ఫాలోయింగ్‌ కూడా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.

అదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డిని వైయస్సార్ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి వాడుతారని అంటున్నారు. చట్ట ప్రకారమే జరుగుతాయని, తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోక తప్పదని వివేకానంద రెడ్డి అనడాన్ని బట్టి వైయస్ జగన్ మీద విచారణను ఆయన తప్పు పట్టడం లేదని తెలుస్తోంది. ఆయన కాంగ్రెసు వెంట నడవాలనే ఉద్దేశంతోనే ఉన్నాని చెప్పారు. తగిన ప్రాధాన్యం ఇస్తామనే హామీ సోనియా నుంచి లభించిన తర్వాతనే ఆయన కాంగ్రెసుకు పూర్తి విధేయంగా మారినట్లు చెబుతున్నారు. సోనియా మాట మేరకే చిరంజీవి, వైయస్ వివేకా పదవులు లేకున్నా కాంగ్రెసుకు కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+