చిక్కుల్లో కిరణ్: జగన్ హ్యాపీ, టిడిపికి అస్త్రం

సిబిఐ పెట్టిన కేసుల్లో ఐఎఎస్ అధికారులను మాత్రమే బలి పశువులను చేస్తున్నారని, రాజకీయ నాయకులను పట్టించుకోవడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మొదటి నుంచీ విమర్శిస్తూ వస్తున్నారు. వైయస్ హయాంలో జరిగిన నిర్ణయాలకు మంత్రి వర్గ సభ్యులను కూడా బాధ్యులను చేయాలని అంటున్నారు. మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో వారి డిమాండ్ కొంత మేరకు నెరవేరినట్లే. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేస్తున్న ఆరుగురు మంత్రులు చిక్కుల్లో పడినట్లే.
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తున్న ఆరుగురు మంత్రులను తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై సోమవారం శాసనసభా కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ స్తంభింపజేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంతగా చిక్కుల్లో పడితే వైయస్ జగన్ వర్గానికి అంతగా సంతోషం వేస్తుంది. దీంతో వైయస్ జగన్ ఏదో మేరకు ఊరట పొందినట్లే చెప్పాలి.












Click it and Unblock the Notifications