వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్, చంద్రబాబు: రివర్స్ గేర్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan - Chandrababu Naidu
వైయస్సార్ కాంగ్రెసు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రివర్స్ గేర్‌లో వెళ్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నాయకులను తన వైపు తిప్పుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నాలు చేస్తుంటే, కాపు నాయకులతో చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమ్మ, కాపు సామాజిక వర్గాల గురించి, మతాల గురించి పార్టీల నాయకులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కాపు నాయకులతో చంద్రబాబు జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తాము ఆరుగురు కాపులకు టికెట్లు ఇచ్చామని, కాపులు సొంత ఇంటికి రావాలని చంద్రబాబు బహిరంగంగా పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కాపులకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద సంఖ్యలో కాపులు ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత కాపులను తమ పార్టీ వైపు వైపు ఆకర్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న చదలవాడ కృష్ణమూర్తిని తమ పార్టీలోకి తీసుకుని తిరుపతి టికెట్ ఇచ్చారు.

విజయవాడ నాయకుడు వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, విజయవాడ రాజకీయాల కారణంగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. సొంత సామాజిక వర్గం మద్దతుతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. వైయస్ జగన్ రెడ్డి కాదనే విషయాన్ని తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానించారు. ఇటు రెడ్లను, కాపులను తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు ఉప ఎన్నికల్లో కోస్తాలోని రెండు నియోజకవర్గాల్లో, రాయలసీమలో నాలుగు నియోజకవర్గాల్లో కాపులను పోటీకి నిలబెట్టారు. మరోవైపు జగన్ కొంత మంది కమ్మనాయకులను ఆకట్టుకోవడం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల నాయకునిగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జయాపజయాల మాట ఎలా ఉన్నా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చునని తెలుగుదేశం నాయకత్వం భావిస్తోంది.

English summary

 According to political analysts - Telugudesam president N Chandrababu Naidi is trying to woo Kapu leaders, while YSR Congress president YS Jagan has concentrated on Kamma leaders. Chandrababu openly invited Kapu leaders to come forward to join in Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X