ఢిల్లీలో వైయస్ వివేకానంద రెడ్డి చక్కర్లు

YS Vivekanda Reddy
పదవి కోసం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. తాను శాసనసభ్యుడిగా గెలిస్తేనే మంత్రి పదవి తీసుకుంటానని సవాల్ చేసిన ఆయన పులివెందుల ఉప ఎన్నికలో వదిన వైయస్ విజయమ్మపై ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఏ పదవీ తీసుకోలేదు. అవకాశం ఉన్నప్పటికీ ఆయన శాసన మండలికి కాంగ్రెసు నాయకత్వం నామినేట్ చేయలేదు. ఆయన నిరాశ చెందారో, తన సవాల్‌కు కట్టుబడి ఉన్నారో తెలియదు గానీ ఇప్పటి వరకు ఏ పదవీ లేకుండా మధ్య మధ్యలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు.

ఇప్పుడు అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన పార్టీ అధిష్టానం పెద్దలను కలుసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సీటు కోసం ఆయన సోనియాను అడిగినట్లు చెబుతున్నారు. తనకు పదవి ఇస్తే బాగుంటుందని వైయస్ వివేకానంద రెడ్డి మీడియా ప్రతినిధులతో కూడా చెప్పారు.

పులివెందుల ఉప ఎన్నికలో వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మపై ప్రజలకు గల సానుభూతి వల్లనే ఓడానని కూడా ఆయన ప్రకటించుకున్నారు. రాష్ట్ర పరిస్థితి అంతా సవ్యంగా ఉందని ఆయన కితాబు ఇచ్చారు. 2014లో మళ్లీ కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సోనియాను కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కూడా ఆయన కలిసే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+