ప్రణబ్ అభ్యర్థిత్వం: ఫిక్స్‌లో జగన్, కెసిఆర్

Pranab Mukherjee
రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని బలపరచాలా, వద్దా అనే విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చిక్కుల్లో పడ్డారు. ప్రణబ్ ముఖర్జీని బలపరచడం వల్ల ఎదురయ్యే సమస్యలు వారిని వెనక్కి లాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని కెసిఆర్ తొలుత భావించినప్పటికీ ఇప్పుడు సందేహంలో పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీని బలపరచకూడదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. పరకాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ జెఎసిని కాదనే పరిస్థితి కెసిఆర్‌కు లేదు. అంతేకాకుండా తెలంగాణ అంశాన్ని నానుస్తున్న కాంగ్రెసు అధిష్టానం బృందంలో ప్రణబ్ ముఖర్జీ కూడా ఒకరు. దాంతో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీకి కెసిఆర్ మద్దతు ఇస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఆయన డైలమాలో పడ్డారు.

కాగా, వైయస్ జగన్ కూడా ప్రణబ్ ముఖర్జీని బలపరిచే విషయంలో ఫిక్స్‌లో పడినట్లే. ఇంతకాలం తాను కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు జగన్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే సమయంలో జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తే తెలుగదేశం పార్టీ వ్యాఖ్యలను నిజం చేసినట్లు అవుతారు.

రాష్ట్రంలోని క్రైస్తవ సంస్థలు సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. ఎపి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్‌తో పాటు ఇతర క్రైస్తవ సంస్థలున సంగ్మాకు మద్దతు ఇస్తున్నాయి. క్రైస్తవుల మాటకు అనుకూలంగా వైయస్ జగన్ వ్యవహరించాల్సి ఉండింది. క్రైస్తవ సమాజంతో వైయస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే, బిజెపి సంగ్మాను బలపరుస్తుండడంతో వైయస్ జగన్ డైలమాలో పడాల్సి వచ్చింది. బిజెపి లేకుంటే సంగ్మాను బలపరచడానికి వైయస్ జగన్‌కు ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు.

కెసిఆర్ కూడా అదే రకమైన సమస్యను ఎదుర్కుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బిజెపి తనను సవాల్ చేస్తుండడమే కాకుండా బిజెపి బలపరుస్తున్న సంగ్మాకు మద్దతిస్తే మైనారిటీలు దూరం కావచ్చుననే భయం కెసిఆర్‌కు కూడా ఉంది. ఈ స్థితిలో ప్రణబ్, సంగ్మాల్లో ఎవరిని బలపరచాలనే విషయంపై కెసిఆర్, జగన్ తీవ్రమైన యోచన చేయాల్సిన స్థితిలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+