జగన్‌కు కౌంటర్: ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం?

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తామే ప్రతిపాదించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారనే వాదనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి దాన్ని వాడుకోవాలని వైయస్ జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ ప్రయత్నాలను గమనించిన చంద్రబాబు తామే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తిప్పికొట్టాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే అక్టోబర్‌లోనే ఎన్నికలకు పోవాల్సి ఉంటుందని కూడా అంచనా వేశారు. కృష్ణాజిల్లాలో రెండవ విడత పాదయాత్ర జరుపుతున్న ఆయనను మహబూబ్‌నగర్ జిల్లా నేతలు కలిశారు.

ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, చంద్రశేఖర్, జైపాల్‌యాదవ్, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, జిల్లా పార్టీ పరిశీలకుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు మోపిదేవి గ్రామం వచ్చి గురువారంనాడు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అంశాన్ని అధినేత ముందు ప్రస్తావించారు. పాదయాత్ర ముగిసే నాటికి అవిశ్వాస తీర్మానం అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చేసి అక్కడి నుంచే నేరుగా అసెంబ్లీలో జరిగే చర్చకు వెళితే బాగుంటుందని కొంతమంది నాయకులు చంద్రబాబుకు సూచించారు.

మార్చి 13 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయాన్ని ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశాల్లో కిరణ్‌కుమారెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ పార్టీ పెట్టిన తీర్మానానికి మద్దతిచ్చేకంటే తమ పార్టీనే అవిశ్వాస తీర్మానం పెడితే బాగుంటుందని సీనియర్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+