టి టు రూపాయి: ఆర్నెల్లు చాలని బాబు సవాల్

Chandrababu Naidu
హైదరాబాద్: తనకు అధికారమిస్తే ఆరు నెలల్లో సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. రూపాయి నుండి విభజన వరకు అన్ని సమస్యలను తాను పరిష్కరిస్తానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడితే చేతులు కట్టుకొని చూసేందుకు సిద్ధంగా లేమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును నాడు ఇందిరా గాంధీ దించితే ప్రజలు ఆమె మెడలు వంచారన్నారు. నేడు సోనియాకు అదే పని చేస్తారని హెచ్చరించారు.

దొంగే దొంగ దొంగ అంటుంటే.. తాను ఇంట్లో కూర్చోవాలా అన్నారు. రోడ్డెక్కిన ప్రజల కంటే తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో రూపాయి పతనమైందని, ఎపి అంధకారంలోకి వెళ్లిందని, పాలన చేతగాకపోతే నమస్కారం పెట్టి దిగిపోవాలని, ప్రజలు తమకు అవకాశం ఇస్తే ఆరు నెలల్లో ఏ సమస్య అయినా పరిష్కరించి చూపిస్తానన్నారు. రాష్ట్ర విభజన సమస్య అయినా, ఆర్థిక వ్యవస్థ పతనం అయినా ఏదైనా సరే పరిష్కరించి చూపిస్తానన్నారు.

వాళ్లేమీ వాళ్ల సీట్లు ఇవ్వక్కర్లేదని, ఆ ముష్టి తనకు వద్దని, గద్దె దిగి ఎన్నికలు పెట్టాలని, ప్రజలే తీర్పు ఇస్తారన్నారు. ఎలాంటి రాష్ట్రాన్ని ఎలా చేశారని, తాను ఒంటి చేత్తో రాష్ట్రపతులు, ప్రధానులు, లోకసభ స్పీకర్లను ఎంపిక చేశానన్నారు. ఈ ఇంట్లో కూర్చుని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఫోన్ చేసి చెప్పానని, నేను ఎంపిక చేస్తే బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయ్యారన్నారు.

దేవెగౌడ తర్వాత ప్రధాని బాధ్యతను జాతీయ నేతలంతా కలిసి తనకు అప్పగించారని, ఎపి భవన్లో ఒక్కో నేతతో అరగంట మాట్లాడి గుజ్రాల్‌ను ఎంపిక చేశానన్నారు. దేవెగౌడను రాజీనామాకు ఒప్పించానని తెలిపారు. దక్షిణ భారత దేశం నుంచి కామరాజ్ నాడార్, రాజగోపాలాచారి, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలు నడిపారని, వారి తర్వాత కాస్తో కూస్తో తాను నడిపానన్నారు. దావోస్‌లో ప్రపంచ దేశాధినేతల ఆర్థిక సదస్సు జరిగితే దానికి వెళ్లడానికి మన దేశ ప్రధానులు భయపడేవారని, అక్కడకు వెళ్తే ఓట్లు రావని దేవెగౌడ చెప్పడంతో వాజ్‌పేయి కూడా రానన్నారని, అయినా రాష్ట్రం కోసం తాను వరుసగా ఎనిమిదేళ్లు వెళ్లానని బాబు చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వస్తే ఆయనను మిస్టర్ క్లింటన్ అని పిలిచాను తప్ప క్లింటన్ అని పిలువలేదన్నారు. తాను తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపానని, వారిలో ఆత్మ విశ్వాసం పెంచానని, తెలుగువాడి దమ్మేంటో చూపించా...మళ్లీ చూపిస్తానని తెలిపారు. ప్రజలు మోసగాళ్లు, దొంగలనే అర్థం చేసుకొంటారా... నాలాంటి వాళ్లను అర్థం చేసుకోరా? కోట్ల మంది ప్రజలు రోడ్లపై ఉంటే నేను ఇంట్లో పడుకోవాలా?, తనకు అంత స్వార్థం లేదన్నారు. తాను చూడని అధికారం లేదని, తనకింకా ఏం కావాలన్నారు.

మహా అయితే ఇంకోసారి అధికారం రాదు అంతేగా? రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అదే చెబుతానన్నారు. ప్రజలు తనను వద్దనుకొంటే నమస్కారం పెడతానన్నారు. తాను చెప్పేది ఒకటేనని, సమస్యల నుంచి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. పరిష్కారాలపై అధ్యయనం చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజల మనసుల్లో హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు, విద్యావకాశాలు, నదీ జలాలపై భయాందోళనలున్నాయని, తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందన్న భయం ఉందన్నారు.

తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు కూడా అనిశ్చితి మంచిది కాదని తాను చెప్పానన్నారు. తెలంగాణను మూడేళ్లు తగలబెట్టారని, ఇప్పుడు సీమాంధ్రను మంటల్లోకి నెట్టారని, రాష్ట్రంలోని రాజకీయ నేతలందరిలోకి తాను సీనియర్‌నని, రాజకీయ కుట్రలు జరుగుతుంటే తాను నోరు మూసుకొని కూర్చోలేనని, తన అభిప్రాయాలను ప్రజలకు చెబుతానన్నారు. తన పర్యటనను ఎవరు ఆపలేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+