నిద్రలేని రాత్రి: రాయుడి కల నెరవేరిన రోజు(పిక్చర్స్)
ఆరంగేట్రంలోనే తెలుగు తేజం అంబటి రాయుడు అదరగొట్టాడు. 17 ఏళ్లకే హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం రాయుడు కల భారత జట్టుకు ఆడటం. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరింది. భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇవ్వడం, విరాట్ కోహ్లీ ఇతని పైన నమ్మకం పెట్టుకోవడంతో జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీ చేసి అదుర్స్ అనిపించాడు. గతంలో జాతీయ జట్టుకు రెండుసార్లు ఎంపికైనా క్రీజులో దిగే అవకాశం రాలేదు.
జింబాబ్వే పర్యటనలో మాత్రం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే ఇన్నింగ్స్‌తో వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో అవకాశం కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ గడిపాడు. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చింది. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే తపనతో ఆడాడు.

నెరవేరిన కల
భారత జట్టుకు ఆడేందుకు తెలుగు తేజం అంబటి రాయుడు ఎన్నాళ్ల నుండే నిరీక్షిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచులో ఇన్నాళ్లకు అవకాశం దొరకింది. గతంలో రెండుసార్లు భారత జట్టుకు ఎంపికైనా రిజర్వ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఆరంగేట్రంలోనే అదరగొట్టి ప్రశంసలు అందుకుంటున్నాడు.

నిద్రలేని రాత్రి
భారత జట్టుకు ఆడేందుకు ఎన్నాళ్ల నుండి నిరీక్షిస్తున్న అంబటి రాయుడు జింబాబ్వేతో జరిగే వన్డే తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో ఆనందం పట్టలేకపోయాడు. ముందు రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదట. చాలా కాలంగా వేచి చూసిన రోజని, ఈ మ్యాచులో ఆడుతున్నాననే విషయం తెలియగానే ముందు రోజు రాత్రి అసలు నిద్రపట్టలేదని, ఆశ్యర్యంలో మునిగిపోయానని, అవకాశాన్ని వదులుకోవద్దని అనుకున్నానని రాయుడు చెప్పాడు.

మాస్టర్‌తో రాయుడు
ఐపిఎల్‌లో తెలుగు తేజం అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌తో కలిసి ఉన్న దృశ్యం

రాయుడుని హత్తుకున్న కోహ్లీ
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో రాయుడు సారథి విరాట్ కోహ్లీకి సహకరించాడు. ఆచితూచి ఆడిన రాయుడు అర్ధ సెంచరీ పూర్తి చేసిన అనంతరం కోహ్లీ అతనిని అభినందించాడు. ఆరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన రాయుడు పదకొండో వాడు.

కోహ్లీ మెచ్చుకోలు
ఆరంభంలోనే అదరగొట్టిన అంబటి రాయుడుకు విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపాడు. చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని చెప్పాడు. అలాగే తన ప్రదర్శన కూడా సంతృప్తినిచ్చిందని, గెలుపుతోనే సిరీస్ ఆరంభించడంలో కిక్ ఉందన్నాడు.
సారథి విరాట్ కోహ్లీకి చక్కటి సహకారం అందిస్తూ జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. మంచి బంతులను గౌరవిస్తూనే అప్పుడప్పుడూ బౌండరీలు బాదుతూ పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శించాడు. ఓపెనింగ్ ద్వయం విఫలమైన లోటును భర్తీ చేస్తూ చెలరేగాడు. చివర్లో కోహ్లీ అవుటైన తర్వాత రైనా ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా లక్ష్యానికి కావాల్సిన పరుగులు తక్కువే కావడంతో ప్ర శాంతంగా పరుగులు రాబట్టాడు. చివర్లో ఫోర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
ప్రచారానికి, లాబీయింగుకు దూరంగా ఉండే రాయుడు అవకాశం కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూశారు. భారత జట్టుకు ఆడేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రాయుడు ఎవరికి అందుబాటులో ఉండడని అంటారు. అయితే అది కేవలం తనకు తాను విధించుకున్న అజ్ఞాతవాసంగా చెబుతారు. మొదటి వన్డేలోనే అర్ధ సెంచరీ చేసిన రాయుడు ఇప్పుడు తన సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డాడు.












Click it and Unblock the Notifications