Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశాంత్‌కి గీతిక కేసు నిందితుడు కందా కౌన్సెలింగ్

Sreesanth
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కేరళ పేసర్ శ్రీశాంత్ నైరాశ్యంలో ఉంటున్న విషయం తెలిసిందే. జైలులో శ్రీ ఒంటరిగా ఉంటూ, ఎవరితో మాట్లాడకుండా బాధలో మునిగిపోతున్నాడని వార్తలు వచ్చాయి. శ్రీశాంత్‌కు బాధ నుండి ఉపశమనం లభించేలా చేసేందుకు ఒకరు దొరికారట.

గతేడాది హర్యానాలో మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి గోపాల్ కందా అదే జైలులో ఉన్నారు. గీతికా శర్మ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో గోపాల్ కందా నిందితుడిగా ఉన్నారు. ఆయన శ్రీశాంత్‌కు శాంతి వచనాలు చెబుతున్నారట.

జైలు నెంబర్ 1లోని వార్డు 9లోనే గోపాల్ కందా ఉన్నారు. శ్రీశాంత్ నైరాశ్యంలో ఉన్నప్పుడు ఆయన(కందా) ఓదార్చుతున్నారని, విడుదల గురించి ఆలోచించకుండా రొటీన్‌గా రోజు గడిపతే సమస్య ఉందని ధైర్యం చెబుతున్నారని శ్రీశాంత్‌ను జైలులో కలిసి వచ్చిన ఓ స్నేహితుడు చెప్పారు. శ్రీశాంత్ ఆవేదన చూసి కందా స్పందిస్తున్నారని చెబుతున్నారు.

టీవి చూస్తూ.. స్కోర్ తెలుసుకుంటూ జైల్లో శ్రీశాంత్

తీహార్ జైలులో ప్రత్యేక సెల్‌లో ఉన్న శ్రీశాంత్ బ్యాడ్మింటన్ ఆడుతూ టీవీ చూస్తూ, ఛాంపియన్స్ ట్రోఫీ స్కోరు తెలుసుకుంటూ సమయం గడుపుతున్నాడు. బ్యాడ్మిండన్ ఆడుతూ, జిమ్నాజియం చేస్తూ గడుపుతున్నాడు. భారత జట్టుకు క్రికెటర్లు శ్రీశాంత్ క్షేమం గురించి కూడా తెలుసుకుంటున్నారట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+