ఆంధ్రజ్యోతి సర్వే: ఆ విషయంలో.. ఎన్టీఆర్ కంటే వైఎస్‌కే ఎక్కువ మార్కులు!
49.92 శాతం మంది ఏపీ ప్రజలు వైఎస్ సంక్షేమ పథకాలకు మద్దతు పలకగా.. 46శాతానికి పైగా జనం ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు భేష్ అన్నారట.
విజయవాడ: ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వేకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సంక్షేమాల పథకాల విషయంలో దివంగత సీఎంలు ఎన్టీఆర్-వైఎస్ మధ్య పోలిక తెచ్చిన సర్వే.. ఎక్కువ మంది జనం వైఎస్ సంక్షేమ పథకాలకే ఓటేశారని స్పష్టం చేసింది.
49.92 శాతం మంది ఏపీ ప్రజలు వైఎస్ సంక్షేమ పథకాలకు మద్దతు పలకగా.. 46శాతానికి పైగా జనం ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు భేష్ అన్నారట. కాగా, 20ఏళ్ల క్రితం నాటి ఎన్టీఆర్ పాలన గురించి, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేదన్నది కూడా గమనించాల్సిన విషయం. మొత్తం మీద ఈ ఇద్దరి హయాంలో అమలైన సంక్షేమ పథకాలు.. ఎన్టీఆర్-వైఎస్ లను జనాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా చేశాయన్న విషయం సర్వే ద్వారా స్పష్టమైంది.

అప్పట్లో.. రెండు రూపాయల బియ్యం, బలహీన వర్గాలకు గృహాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా ఎన్టీఆర్ ప్రజలకు దగ్గరైతే.. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ తదితర సంక్షేమ పథకాలను జనంలో వైఎస్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.












Click it and Unblock the Notifications