నిర్లక్ష్యం! కాన్పులో విడిపోయిన శిశువు తల, మొండెం
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళకు కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల.. పుట్టిన బిడ్డ తల, మొండెం వేరు అయ్యాయని తెలుస్తోంది. ఈ విషాధ సంఘటన యూపిలోని రాంపూర్ ప్రాంతంలో జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం ఆదివారం రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో చేరారు.
అదే రోజు సాయంత్రం కాన్పు జరుగగా, శిశువు తల వేరు పడింది. కాన్పు సందర్భంగా వైద్యులు శిశువు తలను బలంగా లాగడం వల్లే శరీరం నుంచి తల భాగం వేరయిందనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

ఈ సంఘటన రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. మృతదేహం నుంచి వేరుపడిన శరీర భాగాలను చెత్త కుండీలో వేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపనున్నట్లు రాంపూర్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శంకర్‌లాల్ సారస్వత్ తెలిపారు.
ఈ ఘటన పైన దర్యాప్తు ప్రారంభమైందనీ, దోషులుగా తేలినవారికి శిక్ష తప్పదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఘటన జరిగిన ఆస్పత్రిని రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రాకేశ్ కుమార్ సందర్శించారు. గుర్తు తెలియని వ్యక్తులగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications