వారే టార్గెట్‌గా దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు: అంతకుముందే కొండల్లో పేల్చారు!
దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు ముందు ఐఎం ఉగ్రవాదులు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని గుట్టల్లో బాంబు పేలుళ్ల పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్: ఫిబ్రవరి 21, 2013న నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అంతకుముందే ఉగ్రవాదులు మరో చోట పేలుళ్లకు పాల్పడ్డారు. ఇది చాలా మందికి తెలియని ఘటన. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌కు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని కొండల్లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనపై దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఈ విషయాన్ని వన్ఇండియాకు తెలిపారు. మొదట కొండల్లో పేలుళ్లకు పాల్పడిన అనంతరం యాసిన్ భత్కల్, అతని అనుచరులు దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారని చెప్పారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు ముందు బాంబులను పరీక్షించడం కోసమే ఉగ్రవాదులు కొండల్లో మొదట పేలుళ్లు జరిపినట్లు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో బస చేసిన యాసిన్ భత్కల్, అతని అనుచరులు.. అక్కడికి 5కిలోమీటర్ల దూరంలోని గుట్టల్లో బాంబులను పరీక్షించారని తెలిపారు. ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు ఈ ఉగ్రవాదులు. ఈ పేలుళ్లలో 19మంది మరణించగా, 131మంది గాయాలపాలయ్యారు.
అంతేగాక, పేలుడు ఘటనకు ముందు రెండ్రోజులపాటు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. కొద్ది గంటలపాటు వేచి చూసిన తర్వాత ప్రజలు ఎక్కువగా ఉన్న సమయంలోనే ఉగ్రవాదులు బాంబులను పేల్చారని చెప్పారు. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టే.. వారే లక్ష్యంగా ఇక్కడ తాము పేలుళ్లకు పాల్పడ్డామని ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎన్ఐఏ విచారణలో తెలిపినట్లు వెల్లడించారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications