డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రెండంకెల వృద్ధి రేటుకు పరుగెత్తించాలని భావిస్తున్నారు. తాజాగా, విశాఖలో భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల్లోనే దాదాపు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని రంగాల్లోను రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. గుజరాత్‌ను దేశంలో నెంబర్ వన్‌గా నిలిపారు. అయితే అంతకుముందే సమైక్య ఏపీ సీఎంగా చంద్రబాబు సంస్కరణలు తీసుకు వచ్చారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు.
2004లో టిడిపి అధికారంలోకి రాలేకపోవడంతోనే హైదరాబాద్ మళ్లీ మరింత అభివృద్ధి బాట పట్టలేకపోయిందని టిడిపి నేతలు చెబుతుంటారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ.. తాను సీఎంగా ఉండగా హైదరాబాదులో భాగస్వామ్య సదస్సులు నిర్వహించానని, ఆ తర్వాత పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
సిఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించి పెట్టుబడులు వస్తున్నాయని, నా సమర్థత, రాష్ట్రంలోవున్న అవకాశాలు చూసి అనేకమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని చంద్రబాబు అన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
ఎన్నారైల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, జన్మభూమిపై వారికున్న అభిమానాన్ని పెట్టుబడుల రూపంలో చాటుతున్నార చంద్రబాబు అన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజైన సోమవారం 245 ఎంఓయులు జరిగాయి. ఎంఓయులను సిఎం చంద్రబాబు ఆయా కంపెనీల యాజమాన్యాలకు అందించారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి రావడం శుభసూచికమన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. జిడిపిలో 37శాతం ఎంఎస్‌ఎంఇల భాగస్వామ్యం ఉందన్నారు. అందుకే వారికి పెద్దఎత్తున రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు ఎక్కడైనా దెబ్బతింటే, వాటిని ఆదుకునేందుకు 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సిఐఐ కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోందన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
రాష్ట్రంలో పెద్దఎత్తున కారిడార్లను అభివృద్ధి చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. నెల్లూరు, చిత్తూరు, చెన్నై కారిడార్‌ను ట్రై ఇండస్ట్రియల్ జంక్షన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
విశాఖపట్నం- శ్రీకాకుళాన్ని ఒక క్లస్టర్‌గా, కాకినాడ- నర్సాపురాన్ని, అమరావతి- మచిలీపట్నం- వాడరేవును, కర్నూల్- అనంతపురం- బెంగళూరును ఒక కారిడార్‌గా తీర్చిదిద్దనున్నామన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
విశాఖపట్నం- చెన్నై కారిడార్ అభివృద్ధికి 840 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ థెరిస్సాకో వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సోమవారం ఆమె మాట్లాడుతూ... ఇందులో ఎడిబి 625 మిలియన్ డాలర్లు రుణంగా ఇస్తుందన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
ఏపీ ప్రభుత్వం 215 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ థెరిస్సాకో చెప్పారు. ఈ కారిడార్ అభివృద్ధి చెందితే, వచ్చే 30 ఏళ్లలో 11,600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
కాకినాడ- విశాఖపట్నం, గన్నవరం- కంకిపాడు, వేర్పేడు- శ్రీకాళహస్తి రహదారులను అభివృద్ధి చేయనున్నామని థెరిస్సాకో తెలియచేశారు. ఇందుకు ఏడిబి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
రాష్ట్రంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రం రెండంకెల అభివృద్ధి రేటు దిశగా పయనిస్తోందన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
రెండు దశాబ్దాల కాలంలో 14నుంచి 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామన్నారు. ఇందుకోసం ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
117 టార్గెట్లు, 12 గోల్స్ సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. దుబాయ్, సింగపూర్ వంటి చిన్న దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

డబుల్ ప్లాన్: మోడీకంటే చంద్రబాబే ముందు(పిక్చర్స్)
వీటన్నింటినీ మించి భారతదేశం, అందులోనూ ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు హైదరాబాదును ఐటీ రంగంలో ప్రపంచస్థాయిలో నిలిపారని అన్ని వర్గాలు భావిస్తాయి. 2004లోను టిడిపి గెలిస్తే... మోడీ కంటే ముందే సంస్కరణలు ప్రారంభించిన చంద్రబాబు.. గుజరాత్ కంటే సమైక్య ఏపీని ముందంజలో నిలిపేవారని చాలామంది భావిస్తుంటారు.
ఇప్పుడు నవ్యాంధ్రను దేశంలోనే 2029 నాటికి నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారు. 2050 నాటికి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
తాజాగా, విశాఖలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ వృద్ధి రేటును 14 నుంచి 15 శాతంగా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అది అసాధ్యమని విపక్షాలు అంటున్నాయి. అయితే ఈ వృద్ధి కోసం కేంద్రం సాయాన్ని చంద్రబాబు కోరుతున్నారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications