వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి బాధ్యతల నుంచి దిగ్విజయ్‌కి విముక్తి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్‌ను తప్పించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పనులు కాగానే ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటారని ఆ వార్తల సారాంశం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. అందువల్లనే రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఘట్టం ముగిసిన వెంటనే ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి విముక్తి చేస్తారని సమాచారం.

దిగ్విజయ్ సింగ్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు కాకుండానే ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మధుసూదన్ మిస్త్రీ(గుజరాత్), షకీల్ అహ్మద్(బీహార్), మోహన్ ప్రకాశ్(రాజస్థాన్)లను కూడా లోక్‌సభకు పోటీ చేయించే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులు పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు, రాహుల్ జట్టులో చేరేందుకు ఉత్సుకత ప్రదర్శనిస్తున్నారని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు మంత్రి పదవిని వదులుకున్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్, ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్, రక్షణశాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్‌లకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జైరాం రమేష్‌ను ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన పాత్రను జైరాం రమేష్‌కు అప్పగించడానికి సన్నాహాలు పూర్తయినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాజ్యసభ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు పార్టీకి సేవ చేసేందుకు సిద్ధపడుతుండగా, లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇప్పటికే తమ తమ లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ విజయావకాశాలను మెరుగుపర్చుకునే కార్యకమాల్లో నిమగ్నమయ్యారు.

English summary
According to media reports Digvijay Singh may be relieved from the responsibilty of Andhra Pradesh Congress affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X