ఎవరైనా ఊరుకోవద్దు: బాలకృష్ణకు కోపం వచ్చిందట!
అనంతపురం: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చింది. నియోజకవర్గంలో భూదందాలు, సెటిల్మెంట్ వ్యవహారాలను ఆయన సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. భూకబ్జాల విషయం తెలిసిన బాలకృష్ణ ఈ విషయమై సమీక్ష నిర్వహించారని చెబుతున్నారు.
కొంతమంది కలిసి విలువైన భూములను కబ్జా చేస్తున్నారని, సెటిల్మెంట్ చేస్తున్నారని ఆయన దృష్టికి వచ్చిందని, దీనిపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తన నియోజకవర్గంలో ఇలాంటి వాటికి తావు ఇవ్వవద్దనే కృతనిశ్చయంతో బాలకృష్ణ ఉన్నారంటున్నారు.

పార్టీకి చెందిన వారు కూడా పలువురు ఇలా చేస్తున్నారనే ఆరోపణలను ఆయన సీరియస్‌గా తీసుకున్నారని, తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా బాలకృష్ణ వివరాలు సేకరించారని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎవరు అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ అధికారులను ఆదేశించారని చెబుతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!