స్త్రీల అక్రమ సంబంధాలు: భర్తలను చంపిన భార్యలు వీరే

Posted By:
Subscribe to Oneindia Telugu
  అక్రమ సంబంధాలు : భర్తలను చంపిన భార్యల లిస్ట్ !

  హైదరాబాద్: భర్తలను చంపిన భార్యల ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో మహిళను నిందితురాలిగా చేయవచ్చునా అనే విషయంపై సుప్రీంకోర్టు పరిశీలించడానికి సిద్ధపడడం యాధృచ్ఛికమే కావచ్చు.

  కానీ ప్రియుల మోజులో పడి భర్తలను భార్యలు మట్టుబెడుతున్న వైనం ఆందోళనకరంగానే ఉంది. ఆవేశంలోనో, ఉద్రేకంలో జరుగుతున్న హత్యలు కూడా కావు. ప్రియులను, వారి స్నేహితులను సాయంగా తీసుకుని భార్యలు పక్కా పథకం ప్రకారం హత్య చేస్తున్నారు.

  గుంటూరు జిల్లాలో శ్రీవిద్య ఉదంతం

  గుంటూరు జిల్లాలో శ్రీవిద్య ఉదంతం

  గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం పాతులూరుకు చెందిన శ్రీవిద్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపింది. ఈ ఘటనలో నిందితుడు గొట్టిపాటి వీరయ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బావతో కలిసి భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చి భార్య చంపింది.

  గుంటూరు జిల్లాకు చెందిన నరేంద్రచంద్ర, శ్రీవిద్యలు భార్యాభర్తలు. భర్త గత నెల విగతజీవిడిగా కాల్వలో కనిపించాడు. పోలీసుల దర్యాఫ్తులో భార్యనే బావతో కలిసి చంపినట్లుగా తేలింది.

  శ్రీవిద్యకు బావ అయ్యే వీరయ్యతో పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. పెళ్లయ్యాక బావతో కలిసేందుకు సమయం దొరకడం లేదని, మాట్లాడటానికి వీలుపడటం లేదని శ్రీవిద్య భావించి భర్త నరేంద్ర అడ్డుగా తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లు గుర్తించారు.

  సూర్యాపేట జిల్లాలో ఇలా..

  సూర్యాపేట జిల్లాలో ఇలా..

  తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. కొండమల్లెపల్లి మడలం ఏపూరు తండాలో చోటు చేసుకుంది. అర్థరాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమె భర్తను చంపేసింది. భర్త సోమాను హత్య చేసిన ఉదంతంలో పోలీసులు భార్య భారతిని అరెస్టు చేశారు. వరుసకు బావ అయ్యే రమావత్‌ శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

  డిసెంబర్‌ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుంది. భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య చేశారు. మంచంపై నిద్రపోయిన సోమాను శివ గట్టిగా గొంతు నులమగా, భారతి భర్త సోమా ముఖంపై బొంతను వేసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను మృతి చెందారు.

  ఆసిఫాబాద్‌లో భర్తను చంపిన భార్య

  ఆసిఫాబాద్‌లో భర్తను చంపిన భార్య

  తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో భర్తను భార్య చంపింది. మల్లూరి భిక్షపతి (33)కి బాయక్కతో 16 ఏళ్ల కింద వివాహం జరిగింది. బాయక్కకు అదే గ్రామానికి చెందిన ఓ మాజీ నక్సలైట్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డు ఉన్నాడనే కారణంతో భర్త భిక్షపతిని చంపాలని బాయక్క పథకం వేసి హత్య చేసింది.

  కరీంనగర్‌లో భార్య చేతిలో భర్త

  కరీంనగర్‌లో భార్య చేతిలో భర్త

  కరీంనగర్ పట్టణ శివారులో 2015 ఆగస్టులో ఓ భార్య తన భర్తను చంపింది. అయితే ఇది అక్రమ సంబంధానికి సంబంధించింది కాదని తెలుస్తోంది. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే అది తట్టుకోలేకనే షహనాజ్ చున్నితో అతని మెడకు బిగించి హత్యచేసినట్లు తెలుస్తోంది.

  ఖమ్మం జిల్లాలో ఇలా...

  ఖమ్మం జిల్లాలో ఇలా...

  ఖమ్మం: జిల్లాలోని కారేపల్లి మండలంలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ఓ భార్య ప్రియుడితో కలిసి చంపిన సంఘటన ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం తాటిమీదగుంపు గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ఈ సంఘటన 2012 మేలో జరిగింది. ఎర్రయ్య నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడిని పిలిపించి, అతని సహాయంతో భర్త గొంతు నులిమి చంపేసింది. ఇది తెలిసిన గ్రామస్తులు ఆమెను చితకబాది, అరగుండు కొట్టించి ఊరేగించారు.

  అనంతపురం నగర శివారులో..

  అనంతపురం నగర శివారులో..

  అనంతపురం నగర శివారులో రుద్రంపేట పంచాయతీ పంతులకాలనీలో నివాసం ఉంటున్న కిష్టప్పను జాతీయ రహదారి కక్కలపల్లి క్రాస్‌ సమీపంలో హత్య చేశారు. కిష్టప్ప తొమ్మిదేళ్ల క్రితం నిందితులలో ఒకరైన శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి పండ్ల తోటల్లో కూలీ పని చేసేవారు. ఈ క్రమంలో కిష్టప్పకు నూతిమడుగుకు చెందిన కృష్ణతో పాటు మామిడాకులపల్లికి చెందిన అక్కులన్న అలియాస్‌ సూరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వారిద్దరూ అప్పుడప్పుడూ కిష్టప్ప ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో శ్వేతతో చనువుగా ఉండేవారు.

  ఈ విషయంపై కిష్టప్ప భార్యను మందలించాడు. దీనిని జీర్ణించుకోలేని భార్య ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. కిష్టప్పను చంపితే తాము కలిసి ఉండవచ్చని కృష్ణతో తెలిపింది. కృష్ణ కూడా అంగీకరించాడు. అక్కులన్న, హరి, శ్వేత సహాయంతో కృష్ణ కిష్టప్పను హత్య చేశాడు.

  హైదరాబాదులో కూడా..

  హైదరాబాదులో కూడా..

  వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను ఇద్దరు వ్యక్తులతో కలిసి భార్య హతమార్చిన సంఘటన హైదరాబాదులో 2014 మేలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన లక్ష్మప్ప పదిహేనేళ్ల క్రితం అమృత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

  ఆమృత రెండుసార్లు స్వగ్రామానికి ఒంటరిగా వెళ్లింది. గత వారం ఓటు వేయడానికి వచ్చిన ఆమెను గ్రామస్థులు భర్త గురించి అడిగారు. అయితే తాను హత్య చేసినట్లు చెప్పింది. అంతారం గ్రామస్థులు నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. అమృతను, వివాహేతర సంబంధం కలిగిన గోపాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  స్వాతి ఉదంతమే సంచలనం.

  స్వాతి ఉదంతమే సంచలనం.

  నాగర్‌కర్నూలు జిల్లాలో స్వాతి అనే మహిళ తన భర్తను హత్య చేసి ప్రియుడిని అతని స్థానంలో ప్రవేశపెట్టడానికి ఆడిన నాటకం తీవ్ర సంచలనం సృష్టించింది. సుధాకర్ రెడ్డి హత్యకు భార్య స్వాతి, ప్రియుడు రాజేష్‌ పక్కా ప్రణాళిక వేసుకుని పని కానిచ్చారు. మద్యం సేవించి ఇంటికి వచచిన సుధాకర్‌రెడ్డిని ప్రియుడితో కలిసి స్వాతి హత్య చేసింది. ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన భర్త స్థానంలో అతన్ని చూపించాలని అనుకుంది. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది.

  తాగుడుకు బానిసైన భర్తను

  తాగుడుకు బానిసైన భర్తను

  తాగుడుకు బానిసై తనను పెడుతున్న వేధింపులను తట్టుకోలేక ఆమె తన భర్తను చంపించిన ఘటన కూడా ఇటీవల వెలుగు చూసింది. తల్లిదండ్రులు కలిసి కిరాయి హంతకులతో అతన్ని చంపేసింది. భర్త బోజిరెడ్డి మద్యానికి బానిసై భార్య సుజాత మీద అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను నిత్యం వేధిస్తూ వచ్చాడు.

  భర్త బోజిరెడ్డిని హత్య చేయాలని భార్య సుజాత, ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డి, తల్లి సులోచన పథకం వేసుకున్నారు. సుజాత సెప్టెంబర్‌ 18న భర్తకు నచ్చజెప్పి లక్నవరం సందర్శించి మేడారం తీసుకెళ్లింది. అక్కడ ఓ గదిని తీసుకున్నారు. సుధాకర్‌రెడ్డి, కొండల్‌, పరకాలకు చెందిన మడికొండ ప్రవీ ణ్‌, చిట్యాల మండలంలోని గోపాల్‌పూర్‌కు చెందిన కంకనాల రాజు అలియాస్‌ రాజ్‌కుమార్‌ డీసీఎంలో మేడారం చేరుకున్నారు.

  మామ సుధాకర్ రెడ్డి జోజిరెడ్డికి మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దాంతో బోజిరెడ్డి స్పృహ తప్పాడు. అతన్ని వ్యాన్‌లో కమలాపూర్‌ మండలంలోని వంగపల్లి వంతెన వద్దకు రాత్రి తీసుకెళ్లి చంపేశారు. శవాన్ని వంతెన వద్ద వదిలివేసి డీసీఎంలో కరీంనగర్‌ వెళ్లి మిగతా రూ.1.3లక్షలు ఇచ్చేశారు.

  టెక్కీని హత్య చేసిన భార్య

  టెక్కీని హత్య చేసిన భార్య

  తన భర్త టెక్కీని భార్య హత్య చేయించిన ఉదంతం హైదరాబాదులో సంచలనం సృష్టించింది. నాగరాజు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య జ్యోతి తన ప్రియుదు కార్తిక్‌తో కలిసి హత్య చేసింది. కేసు నుంచి తప్పించుకోవడానికి హత్య ఘటనలో పాలుపంచుకున్న నరేష్ అనే యువకుడు గురువారం లాలాగూడలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గుర్తించిన స్థానికులు 108కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించిన అతన్ని పోలీసులు విచారించగా ఈ హత్య గురించి వెల్లడైంది. నేరం బయటపడుతుందని, ఈ హత్యానెపాన్ని తనమీద మోపుతారేమోనన్న భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు నిందితుడు నరేష్ తెలిపాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Wives killing hausbands in Telangana and Andhra Pradesh became hot topics after Swathi's incident.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి