ఒబామాకు ముందే క్లింటన్! మన్మోహన్ ఎక్కువసార్లు

న్యూఢిల్లీ: భారత ప్రధానులు తొమ్మిది మంది ఇప్పటి వరకు అమెరికాలో పర్యటించారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు పలువురు పర్యటించారు. బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఓ అమెరికా అధ్యక్షుడు గణతంత్ర దినోత్సవాలకు రావడం ఇదే మొదటిసారి. ఇక ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు భారత్ వచ్చారు.

అయితే, గణతంత్ర దినోత్సవానికి ఒబామాకు పలికిన ఆహ్వానమే మొదటిది కాదంటున్నారు. గతంలో బిల్ క్లింటన్‌ను ఆహ్వానించినట్లు విదేశాగ శాఖ మాజీ కార్యదర్శి శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఆయన హెడ్ లైన్ టుడేలో ఒబామా పర్యటనపై కరణ్ తాఫర్ నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు.

పీవీ నర్సింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు 1995లో బిల్ క్లింటన్‌వు ఆహ్వానించామని, అమెరికన్ కాంగ్రెస్ వార్షిక సమావేసం ఉన్నందున దానిని మార్చుకోలేని నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు హాజరు వచ్చేందుకు బిల్ క్లింటన్ నిరాకరించారని చెప్పారు.

బరాక్ ఒబామా, నాడు వీరు...

బరాక్ ఒబామా, నాడు వీరు...

1959లో ఐసన్ హోవర్, 1969లో రిజర్డ్ నిక్సన్, 1978లో జిమ్మీకార్టర్, 2000లో బిల్ క్లింటన్, 2006లో జార్జ్ డబ్ల్యు బుష్, 2010లో బరాక్ ఒబామా వచ్చారు. రెండోసారి భారత్ రావడం, గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న అధ్యక్షుడు ఒబామానే.

జవహర్ లాల్ నెహ్రూ

జవహర్ లాల్ నెహ్రూ

భారతదేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అమెరికాలో పర్యటించారు. 1949 అక్టోబర్ 11న తొలిసారి, 1956లో రెండోసారి, 1960 సెప్టెంబర్ 26న మూడోసారి అమెరికాలో పర్యటించారు.

 ఇందిరా గాంధీ

ఇందిరా గాంధీ

భారత ప్రధానిగా పని చేసిన ఇందిరా గాంధీ మూడుసార్లు అమెరికాలో పర్యటించారు. 1966లో, 1976లో, 1982లో అమెరికాలో పర్యటించారు.

 మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్ అమెరికాలో పర్యటించారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. అనంతరం ఒబామాను ఆహ్వానించారు.

 రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీ

గాంధీ కుటుంబానికి చెందిన దివంగత రాజీవ్ గాంధీ ప్రధానిగా 1985వ సంవత్సరంలో అమెరికాలో పర్యటించారు.

 పీవీ నర్సింహా రావు

పీవీ నర్సింహా రావు

గాంధీయేతర కుటుంబానికి చెందిన నాటి కాంగ్రెస్ ప్రధాని పీవీ నర్సింహా రావు పలుమార్లు అమెరికాలో పర్యటించారు. ఈయన హయాంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పుంజుకున్నాయి.

 ఐకే గుజ్రాల్

ఐకే గుజ్రాల్

ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రధానిగా ఉన్న సమయంలో.. 1997లో అమెరికాలో పర్యటించారు. ఆయన న్యూయార్క్‌కు వెళ్లారు.

 వాజపేయి

వాజపేయి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నాలుగుసార్లు అమెరికాకు వెళ్లారు. 2000, 2002, 2003లలో పర్యటించారు.

 మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పలుమార్లు అమెరికాలో పర్యటించారు. ఆయన అందరికంటే ఎక్కువగా ఎనిమిదిసార్లు పర్యటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+