వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇట్స్ క్లియర్?: విజయసాయి తేల్చేసినట్టేనా.. అదే నిజమైతే అవిశ్వాసం ఎందుకు?

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీపై విశ్వాసం ఉంటే రాజీనామాలు, అవిశ్వాసం ఎందుకు ?

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా హామిని నీరుగార్చి ఏపీ ప్రజల సెంటిమెంటుతో ఆడుకుంటున్నారే కాబట్టి తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయించామని టీడీపీ చెబుతున్న సంగతి తెలిసిందే.

అదే సమయంలో వైసీపీ వైఖరి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. హోదా గనుక ఇస్తే.. అది బీజేపీకే సాధ్యమనే తరహాలో మాట్లాడుతోంది. అంటే, టీడీపీ చెబుతున్నట్టు.. తాము తప్పుకోగానే.. వెంటనే వెళ్లి బీజేపీని అలుముకోవడానికి వైసీపీకి సిద్దంగా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాజీనామా చేసినా ఎన్డీయేలోనే: జగన్‌ను దెబ్బకొట్టేందుకు బాబు రాజ్యసభ ప్లాన్రాజీనామా చేసినా ఎన్డీయేలోనే: జగన్‌ను దెబ్బకొట్టేందుకు బాబు రాజ్యసభ ప్లాన్

 ఊతమిచ్చిన విజయసాయి వ్యాఖ్యలు

ఊతమిచ్చిన విజయసాయి వ్యాఖ్యలు

జాతీయ న్యూస్ చానల్ 'ఇండియా టుడే'లో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో భాగంగా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ విజయసాయిని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న ప్రశ్నకు.. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని విజయసాయి పేర్కొన్నారు.

బీజేపీతో దోస్తీకి ఉవ్విళ్లూరుతున్నారా?

బీజేపీతో దోస్తీకి ఉవ్విళ్లూరుతున్నారా?

కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదన్న విజయసాయి బీజేపీపై సానుకూలంగా స్పందించడం గమనార్హం. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బీజేపీతో జతకట్టడానికి ఆ పార్టీ ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది.

మరి అవిశ్వాసం ఎందుకు?

మరి అవిశ్వాసం ఎందుకు?

హోదా బీజేపీ మాత్రమే ఇవ్వగలదన్న నమ్మకాన్ని వైసీపీ ఓవైపు వ్యక్తం చేస్తూనే.. మరోవైపు అవిశ్వాసానికి సిద్దపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. అంటే, కేవలం టీడీపీని ఇరుకునపెట్టేందుకే ఆ పార్టీ అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.

కేసుల భయంతోనేనా?

కేసుల భయంతోనేనా?

మిత్రపక్షంగా ఉన్న టీడీపీనే పట్టించుకోనివాళ్లు వైసీపీ కోరితే మాత్రం హోదా ఇస్తారా?.. ఈ విషయంలో ఏం చూసుకుని వైసీపీ అంత ధీమాగా ఉందన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం.

ఒక విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ, టీడీపీ ఇరువురికి కేసుల భయం ఉండబట్టే బీజేపీతో అంటకాగడానికే ఈ ఇద్దరు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.

 ఆ పనిచేస్తే..:

ఆ పనిచేస్తే..:

ఒకవేళ నిజంగానే టీడీపీ బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటే..వైసీపీ ఎన్డీయేలో చేరినంత మాత్రాన రాష్ట్రానికి హోదా వచ్చేస్తుందా?.. దమ్ముంటే కేంద్రం నుంచి బయటకొచ్చి పోరాడాలని నిన్నటిదాకా సవాళ్లు విసిరిన వైసీపీయే.. ఇప్పుడు బీజేపీని నెత్తికెక్కించుకుంటే.. కచ్చితంగా పార్టీ ప్రయోజనాల కోసం వైసీపీ ఈ పనిచేసిందని జనం భావించకమానరు.

English summary
YSRCP MP Vijayasai Reddy said that they hope BJP regarding special status promise to Andhrapradesh, it's indicating that YSRCP may planning to go with BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X