కెసిఆర్‌తో ఢీ: కోదండరామ్ ఏం చేస్తారు?

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, పాలక పార్టీ టిఆర్‌ఎస్ మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కోదండరామ్ కదలికలను అన్ని పార్టీలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనే విషయంపై కూడా చర్చలు సాగుతున్నాయి. కోదండరామ్ ఏం చేస్తారు, ఏ దిశలో పయనిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

టిఆర్‌ఎస్ ఎప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా, కాంగ్రెస్, టిడిపి నాయకులు కోదండరామ్‌కు మద్దతు పలుకుతున్నాయి. కెసిఆర్, కోదండరామ్‌ల మధ్య విభేదాలు ఇప్పుడు బయటపడ్డా గత మూడేళ్ల నుంచి అంతర్గతంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహించిన సమయంలోనే కోదండరామ్ వైఖరిపై టిఆర్‌ఎస్ వ్యతిరేకత ప్రదర్శించింది. అప్పటినుంచి జరిగిన కొన్నిసంఘటనలు జెఎసితో టిఆర్ఎస్ మధ్య అంతరాన్ని పెంచుతూ వచ్చాయి.
ప్రభుత్వ పాలన బాగుందని తొలినాళ్లలో కోదండరామ్ అభినందించారు. అమెరికా వెళ్లి వచ్చిన తరువాత ఆయనలో మార్పు వచ్చిందని అంటూ అక్కడ ఏం జరిగిందని టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Kodandaram vs KCR: it has three years episode

టిఆర్‌ఎస్, టిజెఎసిల మధ్య సాగుతూ వచ్చిన ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష పోరుగా మారడం ఇదే తొలిసారి. 2009లో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి తెరవెనక్కి వెళ్లినప్పుడు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అన్నిపార్టీల కలుపుకొని ఉద్యమించడానికి తెలంగాణ జెఎసి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

టిజెఎసి ఏర్పాటులో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ప్రధాన భూమిక, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, టిడిపి, న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు టిజెఎసిలో పాల్గొన్నారు. కోదండరామ్ నాయకత్వానికి అప్పుడు టిడిపి సైతం మద్దతు ఇచ్చింది. అధికారంలో ఉండడం వల్ల టిజెఎసి నుంచి తొలుత కాంగ్రెస్ బయటకు వచ్చింది. టిడిపిని జెఎసి బహిష్కరించింది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం టిజెఎసి నాయకత్వంలో సాగినా తెలంగాణ ఆవిర్భావం తరువాత టిజెఎసి పాత్ర నామ మాత్రంగా మారింది.

కెసిఆర్‌పై కోదండరామ్ వార్: తెలంగాణలో ప్రతిపక్షం అదే...సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని జెఎసి తరఫున పిలుపు ఇవ్వాలని కెసిఆర్ కోరగా, అందుకు జెఎసి అంగీకరించలేదు తెలంగాణ ఏర్పడిన తరువాత జెఎసిలోని రాజకీయ పక్షాలన్నీ ఎవరి దారిలో వారు వెళ్లడంతో జెఎసి పాత్ర నామమాత్రంగా మారింది.

రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలే టిజెఎసిలో కీలక భూమిక పోషించాయి. తొలుత రాజకీయ పక్షాలు, తరువాత ఉద్యోగ సంఘాలు జెఎసి నుంచి బయటకు రావడంతో అది బలహీనపడినట్లు కనిపించింది. అయతే తాజాగా అధికార పార్టీ, టిజెఎసి మధ్య విభేదాలు తారస్థాయకి చేరడంతో టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే పలు ప్రజా సంఘాలు జెఎసి పట్ల ఆసక్తి చూపుతన్నాయి. తెలంగాణ రాజకీయాలను ఈ పరిణామాలు మలుపు తిప్పే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తిరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+