నంద్యాలకు నారా లోకేష్ దూరం: చంద్రబాబు సందేహమే....
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తారని భావిస్తున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి తనయుడూ మంత్రి నారా లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
విజయవాడ: వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తారని భావిస్తున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి తనయుడూ మంత్రి నారా లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన పాత్ర ఏ మాత్రం కనిపించలేదు. నిజానికి, నారా లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలో పెద్ద యెత్తునే సందడి చేస్తారని భావించారు. కానీ అదేదీ లేకుండానే నంద్యాల ఉప ఎన్నిక జరిగిపోయింది. తన వారసుడిగా చంద్రబాబు నారా లోకేష్‌ను ముందుకు తేవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
అటువంటి స్థితిలో నంద్యాల క్రెడిట్ నారా లోకేష్‌కు దక్కకుండా ఎందుకు చేశారనేది సందేహం సర్వత్రా వ్యక్తమవుతూ వచ్చింది. నిజానికి, నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తేలిపోయింది.

అంత మంది పాలు పంచుకున్నా....
నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టిడిపి విజయం కోసం ఆరుగురు మంత్రులు, 60 మంది పార్టీ శాసనసభ్యులు పాటుపడుతూ వచ్చారు. వీరందరూ పూర్తిగా నంద్యాలలోనే ఉండిపోయారు. దానికితోడు, మిగతా మంత్రులు కొంత మంది, ఎమ్మెల్యేలు మధ్య మధ్యలో వస్తూ వెళ్లిపోతూ వచచారు.
Recommended Video


రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని....
నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నారా లోకేష్‌ను నంద్యాల ఎన్నికకు దూరంగా ఉంచినట్లు చెబుతన్నారు. అంతా సజావుగా ఉంటే ఆయనకే బాధ్యతలు అప్పగించి ఉండేవారు. కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకంగా ఉండడంతో టిడిపి గెలుపు అంత సులభంగా కనిపించలేదు. ఫలితం వ్యతిరేకంగా వస్తే దాని ప్రభావం లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై పడుతుందని భావించి ఆయనను దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు.

ఒక్కసారి ఇలా....
నంద్యాల ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జులై 14వ తేదీన నారా లోకేష్ నంద్యాలను సందర్శించారు. ఆ తర్వాత ఆయన ఊసే లేదు. టిడిపికి విజయం నల్లేరు మీద నడక అయి ఉంటే నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించి ఉండేవారని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు.

అలా చేశారు....
తొలుత అమరావతి నుంచి లోకేష్ నంద్యాల ఎన్నిలో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను తీసుకున్నారు. టిడిపి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ ఆయనకు ఇవ్వవచ్చుననేది ఆలోచన. కానీ పరిస్థితులు అంత సజావుగా కనిపించకపోవడంతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆయనను పూర్తిగా దూరం పెట్టినట్లు చెబుతున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications