కెసిఆర్‌పై ఫైట్: వారు ఒక్కటి, పవన్ కూడా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై సమరానికి బిజెపి, తెలుగుదేశం పార్టీలు చేతులు కలిపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు కలిసి వస్తారని అనుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నాటికి మూడు శక్తులు ఏకమై కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నాయి.
ఆదివారం ఉద యం టిడిపి తెలంగాణ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నివాసంలో భేటీ అయ్యారు. భవిష్యత్‌లోనూ తమ మైత్రి ఇలాగే కొనసాగాలని అభిలషించారు.
రాబోయే కార్పొరేషన్, కంటోన్మెంట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించారు. రెండు పార్టీలు కలిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ లాభముంటుందని, మెజారిటీ తామే గెలుచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపికి టిడిపి మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది. ఈ దోస్తీని కెసిఆర్‌పై సమరానికి కొనసాగించాలని బండారు దత్తాత్రేయ, చంద్రబాబు భేటీలో నిర్ణయించారు.

చంద్రబాబుతో దత్తాత్రేయ
బిజెపి తెలంగాణ నేతలు, టిటిడీపి నేతలు కలిసిపోయి చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో సరదా ఇలా కనిపించారు.

సీరియస్‌గానే మంతనాలు
కెసిఆర్‌ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై బండారు దత్తాత్రేయకు, చంద్రబాబుకు మధ్య చాలా సీరియస్‌గానే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా..
కెసిఆర్‌ను ఎదుర్కోవడానికి బిజెపి, టిడిపి చేసే ఉమ్మడి పోరుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications