రోజా హైడ్రామా: హైకోర్టు నుంచి అసెంబ్లీకి (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసనసభ్యురాలు రోజా విషయంలో గురువారంనాడు క్షణక్షణం ఉత్కంఠ చోటు చేసుకుంది. ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించడం దగ్గరి నుంచి ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు ఉత్కంఠ నెలకొంది.
రోజాను ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదనే గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. తనకు ఎదురయ్యే అనుభవాన్ని ముందుగానే ఊహించిన రోజా హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ లభించే వరకు అసెంబ్లీ వైపు రాలేదు. తన సస్పెన్షన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీతో ఆమె అసెంబ్లీ వద్దకు వచ్చారు.
ఆమె వచ్చేసరికే శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. అసెంబ్లీకి వచ్చిన రోజాకు గేట్ వద్ద స్వల్ప ప్రతిఘటన మాత్రమే ఎదురైంది. ఆమె ఆర్డర్ కాపీ చూపించి శాసనసభ ప్రాంగణంలోకి అడుగు పెట్టి, ఆర్డర్ కాపీని పార్టీ మిగతా శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ కార్యదర్సి సత్యనారాయణకు అందించారు.

ఆర్డర్ కాపీతో అసెంబ్లీకి...
హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని తీసుకుని, తన తరఫు న్యాయవాదులతో కలిసి రోజా అసెంబ్లీకి వచ్చారు. అప్పటికే శాసనసభ మర్నాటికి వాయిదా పడింది.

పట్టరాని ఆనందం...
హైకోర్టు తీర్పుతో రోజాలో ఎనలేని ఆనందం కనిపించింది. అసెంబ్లీ వద్ద ఆమెకు తన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల నుంచి స్వాగతం లభించింది.

ఆర్డర్ కాపీని చూపించారు...
రోజా హైకోర్టు ఆర్డర్ కాపీని ఆసెంబ్లీ గేటు వద్ద ఉన్న సిబ్బందికి చూపించి ఆవరణలోకి అడుగు పెట్టారు. నేరుగా అసెంబ్లీ కార్యదర్శి చెంతకు వెళ్లి ఆయనకు కాపీని అందించారు.

అసెంబ్లీలో ఇలా...
తమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులతో కలిసి రోజా అసెంబ్లీ అవరణలో ఆనందంగా కనిపించారు. తాను శుక్రవారంనాడు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతానని చెప్పారు.

న్యాయస్థానంపై నమ్మకం పెరిగింది...
తనపై వేసిన సస్పెన్షన్ వేటును కొట్టేయడం వల్ల న్యాయస్థానంపై తనకు విశ్వాసం రెండింతలైందని రోజా అన్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేస్తే తాను ఎదుర్కుంటానని చెప్పారు.

జీరో అవర్‌లోనైనా...
తన నగరి నియోజకవర్గం ప్రజల సమస్యలను లేవనెత్తడానికి జీరో అవర్‌లోనైనా తనకు అవకాశం ఇవ్వాలని రోజా అన్నారు.

అన్యాయం జరిగింది...
అసెంబ్లీలో అధికార పార్టీ నిర్ణయం వల్ల తన హక్కులకు భంగం కలగడమే కాకుండా తన నియోజకవర్గం ప్రజలకు అన్యాయం జరిగిందని రోజా అన్నారు.

మీడియా పాయింట్ వద్ద...
అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఆర్డర్ కాపీ అందించిన తర్వాత రోజా మీడియా పాయింట్ వద్దకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.

ధిక్కరించినట్లు మాట్లాడితే...
హైకోర్టు తీర్పును ధిక్కరించినట్లు అధికార తెలుగుదేశం పార్టీవారు మాట్లాడితే ఆ విషయాన్ని కోర్టు చూసుకుంటుందని రోజా చెప్పారు.

జగన్‌తో భేటీ...
మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన తర్వాత రోజా తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి హైకోర్టు ఆర్డర్ కాపీ చూపించారు.












Click it and Unblock the Notifications