Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ ధరల తగ్గింపు: వీటిపైనే

Recommended Video

    New GST Rates Applicable From Today | Oneindia Telugu

    న్యూఢిల్లీ: జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గించిన నేపథ్యంలో బుధవారం నుంచి 200లకుపైగా వస్తువులు ఇంతకుముందు కన్నా తక్కువ ధరలకే లభించనున్నాయి. గత శుక్రవారం గౌహతిలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో జీఎస్టీ తగ్గింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

     తగ్గింపు ఇలా..

    తగ్గింపు ఇలా..

    జీఎస్టీ తగ్గింపు ధరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో 18శాతం నుంచి 5శాతానికి తగ్గించిన జీఎస్టీ రేట్స్ నవంబర్ 15నుంచి అమల్లోకి వస్తుందని ఆరోజే వెల్లడించారు.

     మినహాయింపు..

    మినహాయింపు..

    కాగా, 228 వస్తువుల్లో దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్‌టీ నుంచి మినహాయింపు(18శాతానికి) నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు.

    భారీగా తగ్గింపు..

    భారీగా తగ్గింపు..

    అలాగే జీఎస్‌టీ భారాన్ని హోటల్స్‌పై భారీగా తగ్గించినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.హోటల్స్‌, రెస్టారెంట్లపై జీఎస్‌టీ కౌన్సిల్‌లో విస్తృత చర్చ జరిగిందని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు.

     18నుంచి 5శాతానికి

    18నుంచి 5శాతానికి

    ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్‌, ఏసీ, నాన్‌ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్‌టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు.

     తేడా లేదు..

    తేడా లేదు..

    ఈ క్రమంలో ఏసీ, నాన్‌ ఏసీ తేడా లేకుండా, అలాగే టర్నోవర్‌తో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై 5శాతం టాక్స్‌(విత్ అవుట్ ఐటీసీ)ను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.

     18శాతం

    18శాతం

    అలాగే రూ. 7,500 రూము రెంట్‌ వసూలు చేసే స్టార్‌హోటల్స్‌పై 18శాతం జీఎస్‌టీ (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది.

     తగ్గింపు కారణంగా..

    తగ్గింపు కారణంగా..

    ఔట్‌ డోర్‌ కేటరింగ్‌పై 18శాతం (విత్‌ ఐటీసీ)గా ఉంటుంది. ప్రస్తుత జీఎస్టీ రేట్లు తగ్గించిన కారణంగా ఏడాదికి సుమారు రూ.20వేల కోట్ల నష్టాన్ని కేంద్రం భరించనుంది.

     బుధవారం రాత్రి నుంచి

    బుధవారం రాత్రి నుంచి

    కాగా, జీఎస్టీ రేట్ల తగ్గింపు బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తుండటంతో వినియోగ వస్తువులు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 1800 రకాల వస్తువల రేట్లు మారనున్నాయి.

     ఈ వస్తువులపై

    ఈ వస్తువులపై

    జీఎస్టీ రేట్లు: షాంపుల నుంచి సంగీత పరికరాల వరకు అనేక వస్తువులు తక్కువ ధరలకే లభించనున్నాయి.

     రోజూవారీ..

    రోజూవారీ..

    రోజువారీగా వినియోగించే ఎఫ్ఎంసీజీ వస్తువులైన చాకోలేట్స్, కండెన్స్‌డ్ మిల్క్, కర్రీ పేస్ట్, రిఫైన్డ్ షుగర్, షుగర్ క్యూబ్స్, పాస్తా, చిక్కి, ఇడ్లీ దోసా బట్టర్, ఫ్రోజెన్ ఫిష్, చుయింగ్ గమ్, వాషింగ్ పౌడర్, షేవింగ్ క్రీమ్, బ్లేడ్, షాంపు, డియోడ్రంట్, కాస్మోటిక్స్ మొదలగు వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరలకు లభించనున్నాయి.

     పలు కంపెనీలకు కూడా

    పలు కంపెనీలకు కూడా

    జీఎస్టీ ధరల తగ్గింపుతో వినియోగదారులకే గాక, పలు కంపెనీలకు కూడా లాభదాయకమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

     ఆ కంపెనీలు..

    ఆ కంపెనీలు..

    హెచ్‌యూఎల్, జీఎస్కే కన్జూమర్, జిల్లెట్, నెస్ట్లే, హావెల్స్, క్రాంప్టన్ కన్జూమర్, ఫినోలెక్స్ కేబుల్స్, కజారియా సెరామిక్స్, సోమనీ సెరామిక్స్, సెంచూరి ప్లే, బాటా, వీఐపీ ఇండస్ట్రీస్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఏయిర్‌వేస్ మొదలగు కంపెనీలో ఈ జాబితాలో ఉన్నాయి.

     ఉపశమనం

    ఉపశమనం

    హోటళ్లు, రెస్టారెంట్లలో 18శాతం నుంచి 5శాతానికి జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వారాంతాల్లో బయటి భోజనానికి వెళ్లే వారికి అధిక ధరల నుంచి కొంత ఉపశమనం లభించనుంది.

     తగ్గింపు రేట్లు..

    తగ్గింపు రేట్లు..

    ఇప్పటి వరకు జీఎస్టీ రేట్లతో హోటళ్లు, రెస్టారెంట్ భోజనమంటే బెంబేలెత్తిపోయిన వినియోగదారులు.. బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చే తగ్దింపు రేట్ల కారణంగా ఆ దిగులు చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

     సవరణలు..

    సవరణలు..

    కాగా, ఐటీసీ(ఇన్‌పుట్ టాక్స్‌ క్రెడిట్‌)లో కొన్నిసవరణలు చేసినట్టు జైట్లీ వివరించారు. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను హోటల్‌ యాజమాన్యం వినియోగదారులకు పాస్‌ చేయడం లేదనీ తమ దృష్టికి వచ్చిందన్నారు జైట్లీ.

     ఐటీసీ లభించదు

    ఐటీసీ లభించదు

    అందుకే రెస్టారెంట్ల ఇండస్ట్రీకి ఐటీసీ లభించదని స్పష్టం చేశారు. ఈ కొత్త రేట్లు నవంబరు 15నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు.

     పన్నులేమీ లేకుండా..

    పన్నులేమీ లేకుండా..

    అలాగే పన్నులేమీ లేకుండా ఉన్నవారు ఆలస్యంగా రిటర్న్స్‌ దాఖలు చేస్తే ప్రస్తుతం రూ.200(రోజుకు) జరిమానా విధిస్తుండగా, దాన్ని రూ.20(రోజుకు)కు తగ్గించారు.

    ఆలస్యంగా రిటర్న్స్‌ దాఖలు చేసిన వారికి గతంలో రూ.200(రోజుకు) జరిమానా విధిస్తుండగా.. దాన్ని రూ.50(రోజుకు) చేశారు. జీఎస్టీపై సామాన్యుల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

     భారం కాకుండా..

    భారం కాకుండా..

    కాగా, వినియోగదారులకు భారం కాకుండా ఉండేందుకు జీఎస్టీ పన్ను రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఫిట్‌మెంట్ కమిటీ సిఫార్సుల మేరకే జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు జరుగుతాయని ఆయన తెలిపారు.

     మెరుగుదల

    మెరుగుదల

    మెరుగుదల, విధానపరమైన సరళీకరణ పరిధి ఉన్నంత వరకు హేతుబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు.

     సవరించే అవకాశం

    సవరించే అవకాశం

    కాగా, మరోసారి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను సవరించి, రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు

     దేశ ఆదాయంపైనే

    దేశ ఆదాయంపైనే

    సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడమనేది దేశ ఆదాయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+