వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ పోలింగ్ నేడే-రేపే ఫలితాలు: క్లింటన్-ట్రంప్ హోరాహోరీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటల్లో తెర లేవనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. బుధవారం మధ్యాహ్నానికి అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు ఎవరినేది తేలిపోతుంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ బుధవారం ఉదయం ఏడు గంటల వరకు కొనసాగనుంది.

కాగా, రాష్ట్రాల మధ్య కాలమానంలో తేడాల వల్ల పోలింగ్ సమయంలో రెండు మూడు గంటలు అటూ ఇటుగా ఉంటుంది. బుధవారం తెల్లవారుజాముకల్లా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉదయం 5 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ఎన్నికలపై పలు సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటిస్తారు. బుధవారం మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడుతుంది.

మొత్తం 12 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి.

US election polls and odds tracker: Latest results forecast as race for President reaches final few hours

అధ్యక్ష పీఠం అధిష్టించాలంటే అభ్యర్థులు 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రతిరాష్ట్రం నుంచి ఓటర్లు తమకు నచ్చిన ఎలక్టోరల్‌కు ఓటు వేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికైన అభ్యర్థులు దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనవరి 2, 2017న విజేతను ప్రకటిస్తారు. ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు.

అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆధిక్యం ఇద్దరి మధ్య దోబూచులాడడంతో చివరి వరకు ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఈమెయిల్ వివాదంలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు హిల్లరీకి ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో కాస్త వెనకబడిన ఆమె మళ్లీ దూసుకెళ్తున్నారు. ఇది ఆమెకు మరింత బలం చేకూర్చినట్లయింది.

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి. ఇది ఇలా ఉంటే.. ఎన్నికల్లో హిల్లరీకి విజయం తథ్యమని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 538 ఓట్లలో హిల్లరీకి 292 ఓట్లు వస్తే, ట్రంప్‌కు 245 ఓట్లు వస్తాయని తెలుస్తోంది. అంటే స్వల్ప తేడాతోనే హిల్లరీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయినా, ఎన్నికల ఫలితాలపై అంతటా ఉంత్క వాతావరణ నెలకొని ఉంది.

English summary
With just hours to go before America goes to the polls to elect its 45th President, the race between Donald Trump and Hillary Clinton remains as close as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X