గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధాని: వినుకొండ, పేటల్లో రియల్ బూమ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఊహాగానాల నేపథ్యంలో గుంటూరు, మంగళగిరి, అమరావతి తదితర ప్రాంతాలలో నిన్నటి వరకు భూములకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, శివరామకృష్ణమన్ కమిటీ నివేదిక నేపథ్యంలో.. చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండ తదితర పరిసర ప్రాంతాలలో భూముల ధరలు పెరుగుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులు సహా పలువురు ఈ ప్రాంతంలో భూములను కొనేందుకు వరుస కడుతున్నారట. భవిష్యత్తులో ఇక్కడి భూమికి మంచి లాభం ఉంటుందని భావిస్తుండటం వల్లనే భూములను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అయితే తమ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్‌ను ఇందుకోసం ఉపయోగిస్తున్నారట.

Vinukonda and surrounding areas tastes realty boom

రియాల్టర్స్ కూడా చిలకలూరిపేట, విుకొండ, పరిసర ప్రాంతాల పైన దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతానికి చిలకలూరిపేట-వినుకొండ సెకండ్ ఆప్షన్‌గా ఉందని భావిస్తున్నారట. చాలామంది ఈ ప్రాంతంలో ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మరోవైపు, అమరావతి, నూజివీడు ప్రాంతాలలో రాజధాని ఏరియా ఉండే అవకాశాలు లేవంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిలో భాగం కాకుండా... పర్యాటరరంగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారట.

English summary
The realty boom, which till now was limited to Guntur city, Mangalagiri, Amaravati and other areas, has now spread to Chilakaluripeta, Macharla, Vinukonda and adjacent areas in view of the Sivaramakrishnan Committee report on the new capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X