ధోనీ రహస్యాలు వెల్లడించిన సాక్షి(ఫొటోలు)

రాంచీ: తీరికలేని షెడ్యూళ్లతో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర సీనియర్ ఆటగాళ్లకు వారి వారి కుటుంబసభ్యులతో గడిపేందుకు సమయం దొరికేది కాదు. అయితే ఇటీవల జింబాబ్వే పర్యటనకు భారత యువ జట్టును పంపించడంతో ధోనీతోపాటు ఇతర సీనియర్ ఆటగాళ్లకు కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపేందుకు సమయం దొరికింది.

Wife Sakshi reveals secrets about MS Dhoni, shares pics

ప్రస్తుతం ధోనీ ఇంటిపట్టునే ఉంటూ, తన కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. రాంచీలోని తన స్నేహితులను కలుస్తూ ఉల్లాసంగా ఉంటున్నాడు. అయితే ఇంకా తీరిక సమయంలో ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడనే విషయాలను ధోనీ సతీమణి సాక్షి వెల్లడించింది.

ధోనీ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడనేందుకు రుజువుగా పలు ఫొటోలను సాక్షి ధోనీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇంటి దగ్గరే ఉంటున్న ధోనీ.. తన సూపర్ బైక్‌లను, ఎస్‌యువీని శుభ్రం చేస్తున్నాడని వ్యాఖ్యానించింది. ‘ధోనీ చాలా జాగ్రత్తగా తన బొమ్మల(వాహనాల)ను శుభ్రం చేస్తున్నాడు' అని పేర్కొంది.

ధోనీకి బైకులంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. ఇటీవలో ధోనీ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఎట్టకేలకు కొన్ని నెలల తర్వాత ఆమెను తన ఫస్ట్ రైడ్‌కు తీసుకెళ్తా. గెస్ చేయండి..' అని రాసుకొచ్చాడు. కాగా, ధోనీతోపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మిగితా సీనియర్ ఆటగాళ్లకు కూడా విరామం లభించడంతో వారి వారి కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. వీరందరూ శ్రీలంకతో జరిగే సిరీస్ వరకు జట్టులో చేరతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+