టిలో జగన్ ఓదార్పు!: యూత్ టార్గెట్‌గా లోకేష్

YS Jagan - Nara Lokesh
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఓదార్పు యాత్రకు సన్నద్దమవుతున్నారు. దాదాపు పద్దెనిమిది నెలల అనంతరం జగన్ ఓదార్పు యాత్ర తిరిగి చేపడుతున్నారు. ఈ నెల 16 తేదీ నుండి ఓదార్పు యాత్ర ప్రారంభించే అవకాశముంది. దాదాపు రెండేళ్ల క్రితం ఆయన గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడే ఆయను అక్రమాస్తుల కేసులో సిబిఐ పిలిపించి, విచారించి అరెస్టు చేసింది.

ఇప్పుడు అదే గుంటూరు నుండి పునఃప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తెలంగాణ ప్రాంతంలోనే మొదట పర్యటిస్తానని అందుకు ఏర్పాట్లు చేపట్టాలకు సూచించారట. మొదట రంగారెడ్డి జిల్లా లేదా నల్గొండ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, చంద్రబాబు రెండో జిల్లా ఆత్మగౌరవ యాత్ర చేపట్టనున్నారు. బాబు యాత్ర ఈ నెల 15న ప్రారంభం కానుంది. బాబు యాత్ర ఉంటుందనే వార్తల నేపథ్యంలో జగన్ పర్యటనకు శ్రీకారం చుట్టారంటున్నారు.

డిసెంబర్‌లో నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. డిసెంబరులో లేదా జనవరిలో గానీ ఆయన యాత్రను ప్రారంభించనున్నారు. యువత, విద్యార్థులే లక్ష్యంగా ఆయన యాత్ర చేపట్టనున్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తూ, పలుచోట్ల యువతతో సభలు, సమావేశాలు ఉండేలా యాత్ర ఉండనుంది.

దీనికోసం వారం రోజుల్లో టిఎన్ఎస్ఎఫ్, యువత విభాగం తెలుగు యువత నేతలతో మాట్లాడేందుకు లోకేష్ సిద్ధమయ్యారు. టిఎన్ఎస్ఎఫ్ ద్వారా కాలేజీల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయించి వాటిలో పాల్గొంటారు. అదే సమయంలో పట్టణాలు, గ్రామాల్లో యువత విభాగం ఆధ్వర్యంలో సభలు నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+