keyboard_backspace

టీటీడీ వెబ్‌సైట్, అమెజాన్‌లో శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు: ధర, ఆఫ్‌లైన్‌లో లభించే కేంద్రాల వివరాలివే

Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల కోసం వాటిని విడుదల చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేసే వెసలుబాటును కల్పించారు టీటీడీ అధికారులు. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌లోనూ వాటిని బుక్ చేసుకునే అవ‌కాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

టీటీడీ వెబ్‌సైట్‌లో..

టీటీడీ వెబ్‌సైట్‌లో..


టీటీడీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in, tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఈ క్యాలెండర్లను కొనుగోలు చేయవచ్చు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో పబ్లికేషన్స్‌ అనే అక్షరాలను క్లిక్‌ చేసి, డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా వాటిని ఆర్డర్ చేయవచ్చు. పోస్టల్ ద్వారా వారికి క్యాలెండర్లు, డైరీలను పంపిస్తారు. భ‌క్తులు ఎన్ని క్యాలెండ‌ర్లు, డైరీల‌నైనా బుక్ చేసుకోవ‌చ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు ప్యాకింగ్‌, షిప్పింగ్ ఛార్జీలు అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది.

విదేశాల్లోని భక్తులకు సైతం..

విదేశాల్లోని భక్తులకు సైతం..

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే విదేశాల్లోని భక్తులకు పోస్టల్ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. పోస్టాఫీస్ నిర్దేశిత ఛార్జీల‌ను వ‌సూలు చేసి నిర్ణీత స‌మ‌యంలో వాటిని భక్తులకు అందజేస్తుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ వాటిని కొనుగోలు చేయవచ్చు. దీనికోసం భక్తులు తమ డీడీలను టీటీడీ అధికారులకు ముందుగా అందజేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాటును చేసింది.

డీడీ చెల్లించి..

డీడీ చెల్లించి..

పోస్టల్ ద్వారా టీటీడీ క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయదలిచిన వారు తొలుత- కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది. కవరింగ్‌ లెటర్‌తో కలిపి 'ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కేటీ రోడ్‌, తిరుపతి' అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్‌, డైరీలను పంపిస్తారు అధికారులు. దీనికి పోస్టల్‌ ఛార్జీలను అదనంగా వసూలు చేస్తారు.

డైరీలు, క్యాలెండ‌ర్ల ధ‌ర‌లు..

డైరీలు, క్యాలెండ‌ర్ల ధ‌ర‌లు..

ఒక్కో క్యాలెండర్‌ ధర 130 రూపాయలు. పెద్ద డైరీ 150 రూపాయలు, చిన్న సైజుు డైరీ 120 రూపాయలు. టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రేటు 75 రూపాయలుగా నిర్ధారించారు. శ్రీవారి పెద్ద క్యాలెండర్ 20 రూపాయలు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ 15 రూపాయలు. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండ‌ర్ 15 రూపాయలు. తెలుగు పంచాంగం క్యాలెండర్ 30 రూపాయలు. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి.

 టీటీడీ ఆలయాల్లో..

టీటీడీ ఆలయాల్లో..

విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలు లభిస్తాయి. వీటితో పాటు కొన్ని ప్రధాన టీటీడీ క‌ల్యాణ‌ మండ‌పాలు, అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల‌ కోసం వాటిని విక్రయానికి సిద్ధంగా ఉంచారు. డైరీ, క్యాలెండ‌ర్ల కొనుగోలుకు సంబంధించిన స‌మాచారం కోసం 0877-2264209 నంబ‌రు ద్వారా ప్ర‌చుర‌ణ‌ల విభాగం కార్యాల‌యాన్ని గానీ, 9963955585 నంబ‌రు ద్వారా ప్ర‌త్యేకాధికారిని గానీ సంప్ర‌దించవచ్చు.

English summary
The diaries and calendars of the Tirumala Tirupati Devasthanams (TTD) for the year 2022 can now be booked by devotees in India and abroad on Amazon.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X