Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ధురంధర్' రికార్డుల్ని బద్దలు కొట్టిన కొత్త సినిమా..

ఆదిత్య ధర్​ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్​ హీరోగా నటించిన 'ధురంధర్​' మూవీ బాక్సాఫీస్​ వద్ద అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజ్ అయి 7 వారాలు కావొస్తున్నా ఇప్పటికీ భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

దేశభక్తి నేపథ్యంలో..

ఇక దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం'బోర్డర్ 2'. ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 22న థియేటర్లలో రిలీజైంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం తొలి రోజే భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. దీంతో గతేడాది రిలీజైన 'ధురంధర్' తొలి రోజు కలెక్షన్లు రూ. 28.60 కోట్లను అధిగమించి రికార్డును క్రియేట్ చేసింది.

ఇక బోర్డర్ 2 సినిమా.. 1971 భారత-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ పార్ట్ లాంగేవాలా యుద్ధం మీద దృష్టి పెడితే.. ఈ మూవీ సీక్వెల్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో జరిపిన పోరాటాలను చూపిస్తుంది. పాకిస్థాన్.. భారత్ పై ఆకస్మికంగా జరిపిన వైమానిక దాడుల తర్వాత భారత సైన్యం ఎలా తిప్పికొట్టింది అనేది ఈ కథలో ప్రధానంగా ఉంది.

గ‌ల్ఫ్‌ దేశాల్లో వివాదం

మరోవైపు ఈ చిత్రంపై గ‌ల్ఫ్‌ దేశాల్లో వివాదం నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు పాకిస్థాన్ వ్యతిరేక ధోరణిలో ఉన్నాయనే కారణంతో సెన్సార్ అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

Border 2 Box Office Beats Dhurandhar Opening Creates Massive Records Faces Ban in Gulf Nations

ఈ మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్, అహన్ శెట్టి లు కీలక పాత్రల్లో నటించారు. బోర్డర్ 2 మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+