వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!
వంట గ్యాస్ పై ఆందోళన పెరుగుతోంది. కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితుల్లో పలు ప్రాంతాల్లో హోటళ్లు మూసి వేసారు. ఇంటి అవసరాలకు ఇబ్బంది లేదని ప్రభుత్వాలు చెబుతున్నా.. బుక్ చేసిన తరువాత డెలివరీకి చాలా సమయం తీసుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ గడవు 25 రోజులుగా నిర్దేశించటంతో.. వినియోగదారుల్లో డైలమా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్దకు సిలిండర్లతో రీఫిల్ కోసం వెళ్తున్నారు. ఇదే సమయంలో ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే, వినియోగదారుల్లో మాత్రం ఆందోళన తగ్గటం లేదు. పెద్ద సంఖ్యలో బుకింగ్స్ జరుగుతున్నాయి. అయినా, ఇంటికి సిలిండర్లు డెలవరీ ఆలస్యం అవుతుండటంతో మరింత ఆందోళన పెరుగుతోంది. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన ఏజెన్సీలు వంట గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. అందులో భారత్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం కు సంబంధించి ఏజెన్సీలు కొంత మేర త్వరగానే బుక్ చేసిన వారికి సిలిండర్లు అందిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కు చెందిన ఎజెన్సీలు మాత్రం పది రోజులకు పైగా సమయం తీసుకుంటున్నాయి. దీంతో.. వినియోగదారులు నేరుగా ఏజెన్సీల వద్దకు తమ గ్యాస్ సిలిండర్లతో చేరుకుంటున్నారు. బుకింగ్ సమయం సైతం పెంచటం.. బుక్ చేసిన వెంటనే సిలిండర్ రాకపోవటం ఇప్పుడు సమస్యగా మారుతోంది.

డెలివరీ ట్రాకింగ్ చేయాలంటే.. ఇలా
గ్యాస్ సిలిండర్ సరఫరా ఆలస్యం అవుతుండగా ఇదే సమయంలో గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని, సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంట్లో నుంచే మీ మొబైల్ ఫోన్ నుంచి మీ సిలిండర్ బుకింగ్ ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. ఇండేన్ గ్యాస్, HP గ్యాస్ లేదా భారత్ గ్యాస్ వినియోగదారులు సంబంధిత కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ చేసుకోవచ్చు. మై బుకింగ్, ట్రాక్ సిలిండర్ విభాగానికి వెళ్లి సమాచారం తెలుసుకోవచ్చు. బుకింగ్ తేదీ, డిస్పాచ్, డెలివరీ అప్డేట్లను చూపిస్తుంది. కాగా, ఈ కొరత వేళ కంపెనీలు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసాయి. ఇండేన్ గ్యాస్ : 7718955555, హెచ్పీ గ్యాస్ : 7903105555, భారత్ గ్యాస్: 7715012345 కు కాల్ చేయటం ద్వారా సిలిండర్ ట్రాక్ చేసుకోవచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవటం తో పాటుగా ఫిర్యాదు చేయటం ద్వారా సిలిండర్ పొందే వెసులుబాటు కలుగుతుంది.












Click it and Unblock the Notifications