‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?

ధురంధర్2 భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు తెలుగులో సినీ ప్రియులంతా సోషల్ మీడియాలో పెద్ద చర్చ పెట్టారు. అదేమిటంటే.. బాహుబలి 2 పెద్ద హిట్టా? పుష్ప2 పెద్ద హిట్టా? అని. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1,850 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో అప్పట్లోనే 500 కోట్లకు పైగా వసూలు చేయడం ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ ధరలు కూడా అప్పుడు చాలా తక్కువ. భారతీయ సినిమాకు 'పాన్-ఇండియా' మార్కెట్ ఉందనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ఇది. అప్పటివరకు ఉన్న అన్ని ప్రాంతీయ రికార్డులను క్లీన్ స్వీప్ చేసింది. జాతీయ స్థాయిలో ఒక తెలుగు సినిమాకు దక్కిన గౌరవం పరంగా దీనికి సాటి మరొకటి లేదు. అంతేకాదు.. అప్పటి నుంచి తెలుగు సినిమానే భారతీయ సినీ పరిశ్రమను శాసించే స్థితికి చేరుకుంది. ఇదంతా రాజమౌళి చలవే.

పర్వాలేదనిపించే రీతిలోనే..

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిందని చెప్పొచ్చు. విడుదలైన అతి తక్కువ కాలంలోనే రూ.1800 కోట్ల వసూళ్లు సాధించింది. కేవలం హిందీ బెల్ట్‌లోనే ఇది 1,000 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం గమనార్హం. అయితే పుష్ప2 టికెట్ ధరలు చాలా అధికంగా అమ్మారు. అంతేకాకుండా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ అవదు. ఎందుకంటే పుష్ప మొదటి భాగానికి చాలాచోట్ల నష్టాలు వచ్చాయి. రెండో భాగం పర్వాలేదనిపించేరీతిలోనే ఆడింది.

Baahubali 2 or Pushpa 2 Among these two movies which one achieved industry hit status

అన్నివర్గాలు ఆదరించిన బాహుబలి

వసూళ్లలో పుష్ప 2 ముందున్నప్పటికీ, టికెట్ల ధరల పెరుగుదల వల్ల కలెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఎంతమంది చూశారు అనే కోణంలో చూస్తే మాత్రం బాహుబలి 2 ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. బాహుబలి 2ని థియేటర్లలో సుమారు 10 కోట్ల మందికి పైగా చూశారు. ఇప్పటికీ ఇండియన్ సినిమా చరిత్రలో ఇన్ని కోట్ల టికెట్లు అమ్ముడైన సినిమా మరొకటి లేదు. 'పుష్ప 2' వసూళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అది టికెట్ ధరల పెరుగుదల వల్ల వచ్చిన అంకెలే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ఒకే ఒక్క ప్రశ్నతో దేశం మొత్తాన్ని రెండేళ్ల పాటు ఊగించింది బాహుబలి. బాహుబలి 2 విడుదలైన తర్వాత నెలల తరబడి థియేటర్లలో ఆడింది. 'పుష్ప 2' ఓపెనింగ్స్ పరంగా సునామీ సృష్టించినా, బాహుబలి లాగా అన్ని వర్గాల ప్రేక్షకులను సుదీర్ఘ కాలం అలరించలేకపోయింది. చివరగా బాహుబలి2నే అతి పెద్ద హిట్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో తేల్చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+