‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే

'ధురంధర్' సంచలన విజయం సాధించడంతో సంతోషపడుతున్న బాలీవుడ్ పెద్దలకు మళ్లీ నిరాశే మిగలనుంది. ఎందుకంటే రాబోయే కాలంలో బాలీవుడ్ నుంచి బ్లాక్ బస్టర్ కొట్టే సినిమాలేవీ కనుచూపుమేరలో కనపడటంలేదు. అన్నీ తెలుగు పాన్ ఇండియా సినిమాల హవానే కనపడుతోంది. కాకపోతే ధురంధర్2 అనేది బాలీవుడ్ పరువు కాపాడిందని చెప్పొచ్చు. భవిష్యత్తును పరిశీలిస్తే మాత్రం భారతీయ సినిమా గమనాన్ని నిర్దేశించేది మన టాలీవుడ్ మాత్రమేనని స్పష్టమవుతోంది. కనుచూపు మేరలో హిందీ పరిశ్రమ నుండి 'ధురంధర్' స్థాయి పోటీ ఇచ్చే సినిమాలు ఏవీ కనపడటంలేదు. ఒక్క టాలీవుడ్ మినహా.

బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగువే!

రాబోయే మూడేళ్ల క్యాలెండర్‌ను గమనిస్తే, ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న టాప్-10 సినిమాల్లో అత్యధికం మన తెలుగువే ఉండటం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' గ్లింప్స్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. దీనికి తోడు చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ 'రంగస్థలం' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అటు ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కలయికలో 'స్పిరిట్' పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Dhurandhar 2 Even if this succeeds the upcoming box office storms will be led by Telugu films

భిన్నమైన కథాంశాలు.. భారీ బడ్జెట్‌లు

కేవలం కమర్షియల్ మాస్ సినిమాలు మాత్రమే కాదు, వైవిధ్యమైన ప్రయోగాలతో కూడా తెలుగు దర్శకులు బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేస్తున్నారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో 2027 ఏప్రిల్ లో రాబోతున్న వారణాసి 120 సినిమాల్లో విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రాబోయే 'డ్రాగన్', ప్రభాస్ 'ఫౌజి', కల్కి2 వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోయే సినిమాపై భారీ అంచనాలున్నాయి.

రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు భారతీయ సినిమాకు కొత్త పాఠాలు నేర్పుతుంటే, తెలుగు హీరోలు తమ మార్కెట్‌ను జపాన్ నుండి అమెరికా వరకు గ్లోబల్ స్థాయికి విస్తరించుకుంటున్నారు. దేశవ్యాప్త ప్రభావాన్ని చూపే సత్తా ఉన్న దర్శకులు లేదా నటులు ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. భారతదేశ సినీ రంగాన్ని భవిష్యత్తులో టాలీవుడ్ ఏవిధంగా శాసించబోతోంది అనేదానికి రాబోతున్న సినిమాలే ఒక ఉదాహరణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+