రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ ప్రస్థానం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. ముఖ్యంగా 'పుష్ప' చిత్రంతో ఉత్తరాదిని ఊపేసిన బన్నీ, అక్కడ ఒక స్టార్ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన మనసులో ఉన్న అభిమాన హీరో ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం. విషయాలు ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తున్నాయి. ఒక పాత వీడియోలో అల్లు అర్జున్ ఈ విషయాన్ని చెప్పారు.

బన్నీ చేసిన వ్యాఖ్యలు వైరల్

అల్లు అర్జున్ వ్యక్తిత్వంలో, డ్యాన్స్‌లో, నటనలో మెగాస్టార్ చిరంజీవి ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలను చూస్తూ, ఆయన మేనరిజమ్స్‌ను ఒంటబట్టించుకున్న బన్నీకి మెగాస్టారే సర్వస్వం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిరంజీవి సినిమాల్లో కనిపించిన దగ్గరి నుండి నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగే వరకు, తన ప్రతి విజయాన్ని మెగాస్టార్‌కే అంకితం ఇస్తూ వచ్చారు బన్నీ. సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ కు ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే. కానీ, మెగాస్టార్ తర్వాత బన్నీ అంతలా ప్రేమించే, ఆరాధించే మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతంలో ఒక వేదికపై బన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. 'రామ్ చరణ్ నా ప్రాణం.. నా ప్రాణం కంటే ఎక్కువ.. నేను ఒక హీరోగా కాకుండా, ఒక అభిమానిగా చెబుతున్నా.. చరణ్ నంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే' అని బన్నీ ఎంతో ఆవేశంగా, ఆప్యాయంగా చెప్పుకొచ్చారు.

Allu Arjun expresses deep bond says Mega Power Star Ram Charan is dearer than life itself

ఎంతో సరదాగా ముచ్చటించుకున్నారు

పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. 'ఆయన చూడని రేంజ్ లేదు, ఆయన స్థాయి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ స్థాయికి చరణ్ వెళ్తున్నాడు, వెళ్లాలి కూడా. రాబోయే 25 ఏళ్లు చరణ్ ఒక ధృవతారలా వెలగాలని కోరుకుంటున్నాను' అని అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వారిద్దరి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి నిదర్శనం. కొన్నాళ్లుగా మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని, ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు దూరాన్ని పెంచాయని పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఇటీవల జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో చరణ్, బన్నీ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా మెలిగి, సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించారు. ఈ దృశ్యాలు చూశాక మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబాల మధ్య ఎన్ని చర్చలు జరిగినా, ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానురాగాలు మాత్రం ఎప్పటికీ తగ్గవని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+