రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తోంది. గ్లింప్స్ లో రామ్ చరణ్ లుక్ చూస్తుంటే మళ్ళీ 'రంగస్థలం' నాటి చిట్టిబాబు గుర్తుకు వస్తున్నాడని చెప్పొచ్చు. అయితే ఆ క్యారెక్టర్ కన్నా బాగా డెప్త్ ఉన్న క్యారెక్టర్ లా కనిపిస్తోంది. గడ్డం, మాసిపోయిన బట్టలు, ఆ నడకలో ఉన్న గంభీర్యం చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో చెబుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్నా, ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది.

అభిమానులకు పూనకాలు వచ్చేలా వాయిస్ ఓవర్

బుచ్చిబాబు 'ఉప్పెన'లో చూపించిన విజువల్ గ్రాండియర్ ఈ సినిమాలో కూడా కనిపించింది. ఉత్తరాంధ్ర నేటివిటీని చాలా సహజంగా, పవర్‌ఫుల్ గా తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ కి ప్రాణం పోసింది. గ్లింప్స్ లో వచ్చే ఆ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ మెగా-నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు, రామ్ చరణ్ కు మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ గ్లింప్స్ బయటపెట్టింది.

Peddi Catch the review of Glimpse released on the occasion of mega powerstar ram charan birthday

వదులుకొని తప్పుచేసిన తారక్

ఉత్తరాంధ్ర యాస, అక్కడి వాతావరణాన్ని చాలా 'రా' గా చూపించారు. కలర్ గ్రేడింగ్, ఫ్రేమింగ్ టాప్ క్లాస్ లో ఉన్నాయని చెప్పొచ్చు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక కొత్త రకమైన మాస్ ఎలివేషన్ రామ్ చరణ్ ఇచ్చారు. 'పెద్ది' గ్లింప్స్ కేవలం ఒక టీజర్ మాత్రమే కాదు, ఇది రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద చేయబోయే విధ్వంసానికి ఒక చిన్న ఉదాహరణలా కనిపిస్తోంది. భారీగా పెంచిన బాడీని చూపిస్తూ, స్పోర్ట్స్ డ్రామాకు తాను ఎంత సరిగ్గా నప్పుతానో రామ్ చరణ్ మేకోవర్ స్పష్టం చేసింది.

ఈ సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలో చెర్రీని తప్పితే మరొకరిని ఊహించలేం. అంతగా ఈ పాత్రలో రామ్ చరణ్ లీనమయ్యారు. నిజం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను వదులుకొని తప్పుచేశాడనిపిస్తోంది. అద్భుతమైన డ్రామాగా బుచ్చిబాబు దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అతను సుకుమార్ శిష్యుడిగా, తన టాలెంట్ ను కూడా బయటపెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+