IMDBలో 9.8 రేటింగ్.. వణుకు పుట్టించే ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా..?
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాంల హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమా చూసే ఛాన్స్ ఉండటంతో.. ఎక్కువ మంది ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఓటీటీ ప్లాట్‌ఫాంలు, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో కొత్త కంటెంట్ సందడి..
ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫాం లలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

అదే కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు 'ఐ యామ్ గాడ్' (I Am God). రవి బీ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవి గౌడ, విజేత పరీక్, రవిశంకర్, అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా IMDbలో 10కి గానూ 9.8 మంచి రేటింగ్ దక్కడం మరో విశేషం.
మూవీ స్టోరీ..
ఈ కథలో ఒక సైకో కిల్లర్ మాస్క్ ధరించి వరుస హత్యలు చేస్తుంటాడు. తాను దేవుడినని చెప్పుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఇదే సమయంలో కాలేజీ నేపథ్యంలో ఒక యువ జంట ప్రేమకథ కూడా సమాంతరంగా నడుస్తుంది. ఈ రెండు కథలకు మధ్య ఉన్న లింక్ ఏమిటి ? ఆ సైకో కిల్లర్ అసలు నేపథ్యం ఏంటి? ఎందుకు వరుస హత్యలు చేశాడు ? చివరకు కథ ఎలా ముగుస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఆసక్తికరమైన కథనం, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందించాయి. టాక్‌కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్ (Sun NXT) లో స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉండటంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. థియేటర్లో మిస్ అయినవారు.. మరోసారి చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకునే వారు ఈ సినిమాను ఓటీటీలో తప్పకుండా చూడవచ్చు.

-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications