వైయస్ జగన్‌వైపు కాసాని: 20మంది కార్పోరేటర్లకు వల

తెలుగుదేశం పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. కాసాని మన పార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కలిసి పోటీకి దిగారు. కాసాని శాసనమండలి సభ్యుడిగా పని చేశారు. కీలక నేతగా ఎదిగిన కాసాని ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లో అంతగా కనిపించడం లేదు. తాజాగా ఆయన తిరిగి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకొని మంచి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట.
కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు కాంగ్రెసు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారు. కాలేరు రెండు రోజుల క్రితమే కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకే ఆయన కాంగ్రెసు పార్టీతో తెగతెంపులు చేసుకున్నారనే వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి.
కాలేరు వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున అంబర్‌పేట నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఆయన ఈ రోజు జగన్‌ను జైలులో కలిశారు. ఇప్పటికే నలుగురు కాంగ్రెసు పార్టీ కార్పోరేటర్లు, ఒక తెలుగుదేశం కార్పోరేటర్ జగన్ వైపుకు వెళ్లిపోయారు. మరో 15 నుండి 20 మంది వరకు ఇరు పార్టీల నుండి జగన్ పార్టీలలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కార్పేరేటర్లకు జగన్ పార్టీ ఎప్పటి నుండో గాలం వేస్తోందని అంటున్నారు. ఇరవైకి పైగా కార్పోరేటర్లు జగన్ బుట్టలో పడవచ్చునని చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications