నోరూరించే 'దాబా చికెన్' .. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!
కూల్ వెదర్ లో హాట్ హాట్ స్పైసీ చికెన్ కర్రీ తినాలని ఉంటుంది. అయితే చికెన్ ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. చికెన్ ఫ్రై, కర్రీ, పచ్చడి ఇలా ఏదైనా రుచిగానే ఉంటుంది. పిల్లలు, పెద్దలు చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే బయట రెస్టారెంట్స్ లో దాబా స్టైల్ చికెన్ ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఇంట్లోనే దాబా స్టైల్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి..? దాబా చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..?
దాబా స్టైల్ చికెన్ కర్రీని తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా, ఉల్లిపాయలు రెండు నుంచి మూడు, టమాటాలు మూడు, దాల్చిన చెక్క, లవంగాలు ఆరు, పచ్చిమిర్చి ఆరు, జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా తగినంత, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి. దాబా స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ను మారినేట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్టు, నిమ్మరసం, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ను 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కర్రీలోకి ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. తర్వాత టమాటోలను మిక్సీ జార్లో వేసి గుజ్జుగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మేరినేట్ చేసుకున్న చికెన్ వేసి నీరంతా పోయేలా ఉడికించుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెను దింపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకుని అందులో తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, జాపత్రి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టమాటా గుజ్జును వేసి కుక్ చేసుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో రుచికి సరిపడా కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని మసాలా ముక్కలకు పట్టేలా లో కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో రెండున్నర నుంచి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చి మిర్చి ముక్కలను తుంపి వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత చివరిలో గరం మసాలా, కొత్తిమీర తరుగు వేస్తే సరి దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయినట్టే..
-
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications