సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..!
వేసవిలో సొరకాయ శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. సొరకాయను జ్యూస్ లేదా కర్రీ, పచ్చడి ఇలా ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక పెరుగు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో పెరుగును నిత్యం తీసుకోవడం ద్వారా అనేక జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి సొరకాయ, పెరుగు కాంబోలో సూపర్ టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
సూపర్ టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు చూస్తే.. సొరకాయ ఒకటి , అల్లం పేస్ట్, పెరుగు తగినంత, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు , ఆవాలు, నూనె తగినంత, కొత్తిమీర తరుగును తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పెరుగును తీసుకుని అందులో రెండు గ్లాస్ లు నీళ్లు పోసి మజ్జిగ మాదిరి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో సొరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత అప్పటికే పక్కన పెట్టుకున్న మజ్జిగను పోసి మీడియం మంటపై ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టుకుని నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ వేసి మజ్జిగలో బాగా ఉడికించుకోవాలి. అంతే చివరగా కొత్తిమీర వేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications