వాస్తు ప్రకారం బెడ్రూంలో ఈ వస్తువులుంటే మీకు తిరుగులేదు!
వాస్తు లేకుండా ఇంటి నిర్మాణం జరగదు. అలాగే ప్రతి గది ఏ దిశలో ఉండాలో ఆ దిశగానే నిర్మాణం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని చికాకులు ఎదురవుతుంటాయి. ఇంటికి బెడ్ రూం ప్రధానమైంది. ఇంటి యజమాని విశ్రాంతి తీసుకునేది, నిద్రించేది ఈ గదే కాబట్టి దీనికి సంబంధించిన వాస్తును చాలా జాగ్రత్తగా అనుసరించాలి. లేదంటే చికాకులు కలగడం, నిద్రలేమి, ఆందోళన, వ్యతిరేక ఆలోచనలు లాంటివి ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే నిద్రించే గదిలో సానుకూల శక్తి ఉండేలా చూసుకోవాలి. దీనికోసం కొన్ని వస్తువులను బెడ్ రూంలో పెట్టుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. వారు మొత్తం ఏడురకాల వస్తువులను సూచిస్తున్నారు. అవేంటనేది తెలుసుకుందాం.
రాగి చెంబు బెడ్ రూంలో ఉండాలి.
ఇది వ్యతిరేక శక్తిని గ్రహిస్తుంది, పారద్రోలుతుంది. రాగిచెంబులో నీటిని నింపి రాత్రంతా తల దగ్గర పెట్టుకోవాలి. తర్వాత రోజు ఆ నీటిని మొక్కలకు పోయాలి. దీనివల్ల పీడకలలు రావు. బెడ్ రూంపై వ్యతిరేక శక్తి ప్రభావం తగ్గిపోతుంది.

కమలం పువ్వును బెడ్ రూంలో పెట్టుకోవాలి.
హిందువులు, చైనీయులు, బౌద్ధులు దీన్ని ఆరాధిస్తారు. తామరపువ్వు ఆకారంలో ఓ గాజును బెడ్ రూంలోని టేబుల్ పై పెట్టుకోవాలి. దీన్ని చూడగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. విజయం చేకూరుతుంది.
రోజ్ క్వార్ట్జ్ జెమ్స్టోన్ని బెడ్రూమ్ టేబుల్‌పై పెట్టుకోవాలి.
దీనివల్ల అనుబంధాలు మరింత బలోపేతమవుతాయి. దీన్ని లవ్ స్టోన్ అని అంటారు. దీనికి క్యాండిల్ గ్లో కలిపితే చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా మారిపోతాయి.
లావెండర్ మొక్కను బెడ్రూమ్ టేబుల్‌పై పెట్టుకోవాలి.
ఇది శుభ్రతకు, స్వచ్ఛతకు సూచిక. గందరగోళాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది. ఈ మొక్క ఆకృతి, రంగు బెడ్ రూం రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మొక్కతోపాటు టేబుల్ పై బాంబూ, జాస్మిన్, స్నేక్స్, పీస్ లిల్లీ లాంటి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు.
బెడ్రూమ్ టేబుల్‌పై నెమలి పింఛాన్ని పెట్టుకోవాలి.
ఇది రాహు, కేతు దోషాలను తొలగిస్తుంది. కష్టాలు దూరమవుతాయి. సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
బెడ్రూమ్ టేబుల్‌పై సాల్ట్ ల్యాంప్ పెట్టుకోవాలి.
ఇది బెడ్ రూం చుట్టుపక్కల ఉండే పరిసరాలను శుద్ధి చేస్తుంది. వ్యతిరేక శక్తిని తరిమేస్తుంది. సానుకూల శక్తిని సృష్టిస్తుంది.
భార్యాభర్తలిద్దరూ దిగిన ఫొటోను షోపీస్ గా తయారుచేసి బెడ్ రూం టేబుల్ పై పెట్టుకోవాలి.
దీనివల్ల ఇద్దరి మధ్య అనుబంధం గట్టిపడుతుంది. ఒకరిపై మరొకరికి గౌరవం పెరుగుతుంది.
-
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications