Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.

ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

Horoscope April Month Predictions for Individuals Born Under the Shravana Dhanishta or Shatabhisha Nakshatras

శ్రవణ నక్షత్రం (మకర రాశి 4వ పాదం)

ఈ నక్షత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి జన్మ నక్షత్రం. ఏప్రిల్ నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అనవసర ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కళ్లకు సరైన విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన లేదా శని స్తోత్రం పఠించడం వల్ల శుభం కలుగుతుంది.

ధనిష్ఠ నక్షత్రం (మకరం 1, 2 పాదాలు & కుంభం 3, 4 పాదాలు)

ధనిష్ఠ నక్షత్రం వారు రెండు రాశులలో ఉంటారు, కాబట్టి ఏప్రిల్ నెల వీరికి కొంత సాహసోపేతంగా ఉంటుందని చెప్పొచ్చు. మీ రంగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇదే. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఆర్థికంగా నిలకడ కలిగిన పరిస్థితిలో ఉంటారు. కీళ్ల నొప్పులు లేదా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా చేయడం చాలా మంచిది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. సంయమనం పాటించాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.

శతభిషా నక్షత్రం (కుంభ రాశి)

కుంభ రాశిలో రాహువు సంచారం వల్ల శతభిషం నక్షత్రం వారికి ఈ నెల అత్యంత కీలకమైన నెల. విదేశీ ప్రయాణాలకు లేదా దూర ప్రాంత ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి సానుకూల వార్తలు అందుతాయి. రాజకీయ, ఐటి రంగాల వారికి పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల్లో లాభాలు గడిస్తారు. చర్మ సంబంధిత అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త వహించాలి. చిన్నదేకదా అని తీసేయొద్దు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లల అభివృద్ధి చూసి సంతోషిస్తారు. రాహుకాల సమయంలో దుర్గాదేవిని ఆరాధించడం లేదా రాహు స్తోత్రం పఠించడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+