మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా?
మోడల్, నటి పూనం పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. తన వింత చేష్టలతో, పబ్లిసిటీ స్టంట్లతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే పూనం పాండే మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. తన 'బేబీ బంప్' చూపిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా లేక ఇది కూడా మరో పబ్లిసిటీ స్టంటేనా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బేబీ బంప్‌తో పూనం పాండే ఫోటోలు.. నిజమేనా?
మంగళవారం మధ్యాహ్నం పూనం పాండే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేసింది. మొదటి ఫోటోలో తన టీ-షర్ట్‌ను పైకి లేపి బేబీ బంప్‌ను చూపిస్తూ కనిపించగా.. రెండో ఫోటోలో కెమెరా వైపు తిరిగి తన ప్రెగ్నెన్సీని గర్వంగా ప్రదర్శిస్తూ పోజులిచ్చింది ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా గర్భిణీ స్త్రీ, పాల బాటిల్, చిన్నారి ఎమోజీలను జత చేసి.. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. అయితే పూనం పాండే గత చరిత్రను చూసిన నెటిజన్లు మాత్రం దీన్ని నమ్మడానికి అస్సలు సిద్ధంగా లేరని తెలుస్తోంది.

ఏప్రిల్ ఫూల్ చేస్తోందా? లేక ఏఐ మాయ చేస్తోందా?
గతంలో పూనం పాండే చేసిన పబ్లిసిటీ స్టంట్లను దృష్టిలో పెట్టుకుని నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. రేపు ఏప్రిల్ 1 కావడంతో ఇది కేవలం ఓ రోజు ముందుగా చేసిన ప్రాంక్ అయి ఉంటుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఈ ఫోటోలు చూస్తుంటే ఏఐ ఉపయోగించి ఎడిట్ చేసినట్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం పూనం పాండే ఈ తరహా పబ్లిసిటీ స్టంట్ చేసి ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
చచ్చి బతికిన పూనం పాండే.. ఆ చేదు జ్ఞాపకం!
ప్రజలు పూనం పాండేను అంత సులభంగా నమ్మకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. 2024 ఫిబ్రవరి 1న పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిందని ఆమె టీమ్ అధికారికంగా ప్రకటించి దేశమంతటినీ షాక్‌కు గురిచేసింది. చాలా మంది ప్రముఖులు ఆమెకు సంతాపం కూడా తెలిపారు. కానీ మరుసటి రోజే ఆమె ప్రత్యక్షమై.. "నేను బతికే ఉన్నాను, కేవలం క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే అలా అబద్ధం చెప్పాను" అని ప్రకటించి తీవ్ర విమర్శలపాలయ్యారు. ఆ ఘటన తర్వాత ఆమెను 'నమ్మలేని నటి'గా సోషల్ మీడియా ముద్ర వేసింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. పూనం పాండే
పూనం పాండే ప్రస్థానమే వివాదాలతో మొదలైంది. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమిండియా గెలిస్తే స్టేడియంలో బట్టలు విప్పుతానని ప్రకటించి ఆమె రాత్రికి రాత్రే దేశవ్యాప్త గుర్తింపు పొందారు. పూనం పాండే పర్సనల్ లైఫ్ కూడా వివాదాలతో నిండి ఉంది. 2020లో తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకున్న కొద్దిరోజులకే అతనిపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కంగనా రనౌత్ హోస్ట్ చేసిన 'లాకప్' రియాలిటీ షోలో కూడా తన బోల్డ్ యాటిట్యూడ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.
ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రస్తుతానికి పూనం పాండే బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. పూనం పాండే షేర్ చేసిన ఫోటోల కింద నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టావా?", "రేపు ఏప్రిల్ ఫూల్ అని మాకు తెలుసులే" అంటూ నెటిజన్లు పూనం పాండేను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. మరి ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం ఏమిటనేది పూనం పాండే స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.
-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications