ప్రముఖ చిత్రకారుడు కరుణాకర్ కన్నుమూత
హైదరాబాద్: నంది అవార్డు గ్రహీత, ప్రముఖ చిత్రకారుడు ఎన్.కరుణాకర్ (60) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. బాపూ, బాలి తరువాత ఆ పరంపరలో కరుణాకర్ విశేష కృషి చేశారు. విశాఖపట్నంలో సూర్యప్రకాశ్, కస్తూరి దంపతులకు జన్మించిన కరుణాకర్ అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, అనంతరం ఏపి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు.
ప్రముఖ పత్రికలలో చిత్రకారుడిగా పనిచేశారు. కరుణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. సోమాజిగూడలోని క్రాంతిశిఖర అపార్ట్‌మెంట్‌లో ఆధునిక గ్రాఫిక్స్‌ను ఆయన నడుపుతున్నారు. గురువారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సనత్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు.

ఆయన భౌతికకాయానికి శుక్రవారం సనత్‌నగర్ ఇఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వంచనున్నారు. కరుణాకర్ మృతికి కార్టూనిస్టులు జిఎస్‌ఆర్, కలిమిశ్రీ, జలదంకి ప్రభాకర్, శరత్‌బాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రసిద్ధ చిత్రకారుడు ,మిత్రశ్రీ కరుణాకర్ అస్తమయం మిత్రులకీ పత్రికారంగానికి తీరనిలోటు బ్నిం అన్నారు. చిత్రకారులు, కార్టూనిస్టులు కరుణాకర్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరుణాకర్‌తో తమకు గల సాన్నిహిత్యాన్ని నెమరేసుకున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications