ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం కొనసాగుతుంది. ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి, మకర రాశివారి జాతక ఫలం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రంగాల్లో విజయం లభించినా, మరికొన్ని చోట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట తీరుపై నియంత్రణ ఉంచుకుంటే గొడవలు రావు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆదాయం బాగున్నా, అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. భూమి లేదా వాహన సంబంధిత కొనుగోళ్లపై ఖర్చు చేయడానికి అవకాశం కనపడుతోంది.

Horoscope Predictions for these two zodiac signs Sagittarius and Capricorn for april month

కంటి సంబంధిత సమస్యలు లేదా ఉదర సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. గురువారం రోజున దక్షిణామూర్తిని ఆరాధించడం లేదా పేదలకు అరటిపండ్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో చేసే పనుల్లో విజయం దక్కుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఐటీ, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రయాణం అవకాశాలున్నాయి. వ్యాపారంలో గతంలో నిలిచిపోయిన లాభాలు ఈ సమయంలో అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూల సమయం. గతంలో మీరు ఇచ్చిన అప్పు ఇప్పుడు వసూలవుతుంది.

మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలున్నాయి. బంధువుల రాకతో ఇల్లు ఆనందంగా ఉంటుంది. శనివారం రోజున శివాలయంలో అభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+