మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!
ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దాంతో ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్, కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ చిత్రాలు, సిరీస్‌లు కూడా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి రావడంతో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. ఇక ఓటీటీలో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులకు మంచి కిక్ అందించే చిత్రాలకు ప్రేక్షకులు క్యూ కడుతూనే ఉంటారు.

ప్రస్తుతం ఓటీటీలో ముఖ్యంగా హారర్, థ్రిల్లర్, క్రైమ్, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించడం కష్టం. అలా గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సన్నివేశాలతో ప్రస్తుతం టాప్ రేటింగ్ తో ట్రెండింగ్ లో నిలిచింది ఈ మూవీ..
మూవీ ఏంటంటే..?
ఆడియన్స్ ని ఫుల్ గా అలరిస్తున్న ఈ చిత్రం పేరు "తత్సమ తద్భవ". ఈ మూవీ 2023లో కన్నడలో తెరకెక్కి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకు విశాల్ అత్రేయ రచన, దర్శకత్వం చేశారు. ఓ వివాహిత భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇస్తుంది. దర్యాప్తు సమయంలో భర్త శవం ఆరికా ఇంటి బేస్‌మెంట్‌లో దొరికడంతో కేసు మర్డర్‌గా మారుతుంది. ఇక్కడ నుంచి కథ ఒక ట్విస్ట్‌లతో అదరగొడుతుంది.
ఆరికా ప్రైమ్ సస్పెక్ట్‌గా మారడం, రహస్యాలు బయటపడడం.. ఇలా ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అసలు అతను ఎలా చనిపోయాడు. చంపింది ఎవరనే ఉత్కంఠతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కన్నడ మూవీ అయినప్పటికీ.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండడం కలిసొచ్చే విషయం.












Click it and Unblock the Notifications